సినిమాలపై రవితేజ సంచలన నిర్ణయం..!

14 Apr, 2022 08:40 IST|Sakshi

మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ హీరోగా ఎదిగాడు మాస్‌ మహారాజా రవితేజ. ప్రస్తుతం ఈయన చేతిలో ఐదు సినిమాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఏడాది 'ఖిలాడి' సినిమాతో రవితేజ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది జూన్ 17న 'రామారావు ఆన్ డ్యూటీ'తో పాటు ఇదే ఏడాది దసరాకు 'ధమాకా' చిత్రాలను విడుదలకు సిద్దం చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే హీరోగా ఇంత బిజీగా ఉన్న రవితేజ తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 

ఇకపై కేవలం హీరోగానే కాకుండా పాత్ర నచ్చితే సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా చేయాలని నిర్ణయించుకున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. తనకు కథ నచ్చితే ఇతర హీరోల సినిమాల్లో కూడా నటించడానికి తనకేమీ అభ్యంతరం లేదని ఇప్పటికే దర్శకులకు ఓ మాట చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక ఈ క్రమంలోనే చిరంజీవి హీరోగా బాబీ డైరెక్షన్‌లో రాబోయే సినిమాలో రవితేజ ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. మరోవైపు బాలకృష్ణ, అనిల్ రావిపూడి సినిమాలో కూడా రవితేజ నటించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

మరిన్ని వార్తలు