Ravi Teja : 'హీరోగా రాలేదు,నిర్మాతగానూ నన్ను ప్రోత్సహించండి '

28 Nov, 2022 09:50 IST|Sakshi

‘‘మట్టి కుస్తీ’ వేడుకకి నేను హీరోగా రాలేదు.. నేను కూడా ఒక నిర్మాతగా మాట్లాడుతున్నా. ఈ వేడుకకి మీరే(అభిమానులు) ముఖ్య అతిథులు. హీరోగా నన్ను ఎంతో సపోర్ట్‌ చేశారు.. అలాగే నిర్మాతగానూ ప్రోత్సహించండి’’ అని రవితేజ అన్నారు. విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి జంటగా చెల్లా అయ్యావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మట్టి కుస్తీ’. హీరో రవితేజతో కలిసి విష్ణు విశాల్‌ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్‌ 2న రిలీజ్‌ అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్‌లో రవితేజ మాట్లాడుతూ– ‘‘విష్ణు విశాల్‌ చాలా పాజిటివ్‌ పర్సన్‌. తనని కలిసిన మొదటిసారి ఎన్నాళ్లో పరిచయం ఉన్న వాడిలా అనిపించాడు. సింగిల్‌ సిట్టింగ్‌లోనే ‘మట్టి కుస్తీ’ చిత్రం ఓకే అయిపోయింది.

చెల్లా అయ్యావు ఈ చిత్ర కథ చెప్పినప్పుడు నవ్వి నవ్వి చచ్చాను. తనతో కచ్చితంగా ఓ సినిమా చేయాలి.. చేస్తాను. జస్టిన్‌ ప్రభాకరణ్‌తోన పనిచేస్తాను. రిచర్డ్స్‌ అద్భుతమైన విజువల్స్‌ ఇచ్చాడు. అందం, ప్రతిభ కలిస్తే ఐశ్వర్య లక్ష్మి. ఇందులో తన పాత్ర చాలా బాగుంటుంది. ఇది కేవలం స్పోర్ట్స్‌ ఫిలిం మాత్రమే కాదు. లవ్, ఫ్యామిలీ, యాక్షన్, ఎవెషన్‌.. ఇలా అన్నీ ఉన్నాయి. ‘మట్టి కుస్తీ’ చాలా బాగా వచ్చింది.. కచ్చితంగా అందరూ ఎంజాయ్‌ చేస్తారు’’ అన్నారు.

‘‘రవితేజగారికి మంచి మానవత్వం, మనసు ఉంది. అలాంటి ఆయనకు అభిమానులైన మీరందరూ లక్కీ’’ అన్నారు విష్ణు విశాల్‌. ‘‘మట్టి కుస్తీ’ కథ విష్ణు విశాల్‌గారికి బాగా నచ్చింది. ఈ సినిమాని తెలుగులోనూ తీయడానికి కారణం రవితేజసర్‌ ఇచ్చిన ప్రోత్సాహమే.. ఆయనకు రుణపడి ఉంటాను’’ అన్నారు చెల్లా అయ్యావు. ‘‘విష్ణుపై నమ్మకంతో ఒక్క మీటింగ్‌లోనే ఈ సినివను నేను నిర్మిస్తానని చెప్పారు రవితేజగారు.. అలా చెప్పాలంటే చాలా ధైర్యం ఉండాలి’’ అన్నారు బ్యాడ్మింటన్‌ స్టార్, విషు విశాల్‌ సతీమణి గుత్తా జ్వాల. ఈ వేడుకలో డైరెక్టర్స్‌ సుధీర్‌ వర్మ, వంశీ, ఐశ్వర్య లక్ష్మి, సంగీత దర్శకుడు జస్టిన్‌ ప్రభాకరణ్, కెమెరామేన్‌ రిచర్డ్‌ ఎం.నాథన్, రచయితలు రాకేందు మౌళి, కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు