Rama Rao On Duty: 'రామారావు ఆన్​ డ్యూటీ' టీజర్​ రిలీజ్​.. పవర్​ఫుల్​గా రవితేజ యాక్టింగ్​

1 Mar, 2022 18:02 IST|Sakshi

Ravi Teja Starrer Rama Rao On Duty Teaser Released: మాస్‌ మహారాజ రవితేజ, శరత్‌ మండవ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘'రామారావు ఆన్ డ్యూటీ'’. ఎల్ఎల్పి బ్యానర్​లో సుధాకర్‌ చేకూరి నిర్మిస్తున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు శరత్‌ మండవ తెరకెక్కించాడు. ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమాలో దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తుండగా వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను నేరుగా ఓటీటీ ప్లాట్​ఫామ్​ సోనీ లివ్​లో విడుదల చేస్తున్నట్లు సమాచారం.
 
అయితే తాజాగా మహా శివరాత్రి సందర్భంగా ఈ సినిమా టీజర్​ను మంగళవారం విడుదల చేశారు మేకర్స్​. డిప్యూటీ కలెక్టర్​గా రవితేజ పవర్​ఫుల్​ యాక్టింగ్​ ఆకట్టుకుంటోంది. రవితేజ గురించి 'వాడో సూపర్​ మేన్​' అంటూ టీజర్​ ప్రారంభమవుతుంది. ఇందులో ఫైల్స్​పై రైట్​ అండ్​ లెఫ్ట్  హ్యాండ్స్​తో రవితేజ సంతకం చేయడం ఆకట్టుకుంటోంది. అలాగే ఒక చేతితో సంతకాలు చేస్తూ మరో చేతితో టైపింగ్​ చేయడం అలరిస్తోంది. 'ఆయుధంలా బతికే తనలాంటి ధైర్యం' అంటూ చెప్పే డైలాగ్​ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ టీజర్​ సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది. 

మరిన్ని వార్తలు