Raviteja : రవితేజ 'రావణాసుర' సెకండ్‌ షెడ్యూల్‌ పూర్తి

12 Feb, 2022 17:11 IST|Sakshi

Raviteja And Team Wrapped Up Ravanasura Movie: మాస్‌ మహారాజ రవితేజ ప్రస్తుతం జెడ్‌ స్పీడులో దూసుకెళ్తున్నాడు. బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలతో యమ జోరుమీదున్నాడు. తాజాగా రమేష్‌ వర్మ దర్శకత్వంలో ఆయన నటించిన సినిమా ఖిలాడి సినిమా పాజిటివ్‌ టాక్‌ దిశగా ముందుకెళ్తుంది. ఇదిలా ఉండగా కొన్ని రోజుల క్రితమే షూటింగ్‌ ప్రారంభించిన రావణాసుర సినిమా సెకండ్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. దానికి సంబంధించిన పోస్టర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు.

సుధీర్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సుశాంత్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. అభిషేక్‌ పిక్చర్స్‌, ఆర్టీ టీమ్‌ వర్క్‌ పతాకాలపై అభిషేక్‌ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్‌, మేఘా ఆకాష్‌, ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్‌, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌30న ఈ సినిమాను రిలీజ్‌ చేయనున్నారు.

మరిన్ని వార్తలు