Tiger Nageswara Rao Movie: హంటింగ్ స్టార్ట్.. రవితేజ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.!

24 May, 2023 18:43 IST|Sakshi

బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో మాస్ మహారాజా రవితేజ దూసుకుపోతున్నారు. ఇటీవలే రావణాసుర సినిమాతో మెప్పించిన హీరో.. మరోసారి టైగర్‌ నాగేశ్వరరావుతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నుపుర్ సనన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. 1970-80ల కాలంలో స్టువర్టుపురంలోని గజదొంగ టైగర్‌ నాగేశ్వరరావు పాత్రలో రవితేజ కనిపించననున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్.

(ఇది చదవండి: రవితేజ ఫ్యాన్స్‌కు పూనకాలే.. 'టైగర్‌ నాగేశ్వరరావు' వచ్చేస్తున్నాడు)

ఈ చిత్రంలో రవితేజ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. మాస్ ఆడియన్స్‌కు తగ్గట్టుగానే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు పోస్టర్‌ చూడగానే తెలుస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రవితేజ్ తన ట్విటర్‌లో షేర్ చేశారు. నా టైగర్‌ జోన్‌లోకి మీ అందరికీ స్వాగతం అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరలవుతోంది.

(ఇది చదవండి: నిన్ను చూడాలని, నీ చేతిముద్ద తినాలనుంది: బుల్లితెర నటి ఎమోషనల్)

ఇది చూసిన అభిమానులు హిట్ పక్కా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  కాగా.. అక్టోబర్‌ 20న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సరికొత్త బాడీ లాం‍గ్వేజ్‌తో రవితేజ ఈ చిత్రంలో కనిపించనున్నారు. నుపుర్‌ సనన్‌తో పాటు గాయత్రి భరద్వాజ్ మరో హీరోయిన్‌గా నటించనుంది. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, రేణు దేశాయ్ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. 
 

మరిన్ని వార్తలు