Ram Charan-Anjali: రామ్‌ చరణ్‌కి జోడిగా అంజలి!, ఏ సినిమాలో అంటే..

6 Apr, 2022 08:21 IST|Sakshi

Anjali Team Up With Ram Charan: టాలీవుడ్‌ స్టార్‌ హీరో రామ్‌ చరణ్‌- తమిళ స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో RC15 రూపొందుతున్న సంగతి తెలిసిందే. దీంతో సినిమా హైప్‌ క్రియేట్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో తరచూ ఈ మూవీ నుంచి ఏదొక అప్‌డేట్‌ బయటకు వస్తూ సినిమాపై మరింత ఆసక్తికని పెంచుతుంది. ప్రస్తుతం ఇందులో రామ్‌ చరణ్‌ విభిన్న పాత్రలపై ఆసక్తి నెలకోగా తాజాగా మరో క్రేజీ అప్‌డేట్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో రామ్‌ చరణ్‌ సరసన కియారా అద్వానీ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తెరపై మరో కథానాయిక పేరు వినిపిస్తోంది. ఇందులో తెలుగు అమ్మాయి అంజలి నటిస్తున్నట్లు సమాచారం.

చదవంది: వైరల్‌ అవుతున్న రామ్‌ చరణ్‌ షాకింగ్‌ లుక్‌, పంచెకట్టుతో సైకిల్‌పై ఇలా

చరణ్‌కు జోడిగా అంజలి కనిపించనుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే చరణ్‌ ఇందులో తండ్రికొడుకులుగా కనిపంచనున్నాడట. సీనియర్‌ రామ్‌ చరణ్‌కు సరసన అంజలి నటిస్తుండగా, జూనియర్‌ చరణ్‌తో కియారా రొమాన్స్‌ చేయనన్నట్లు తెలుస్తోంది. చరణ్‌ పంచెకట్టుతో సైకిల్‌పై వెళుతున్నట్లు ఉన్న ఓ లుక్‌ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇది RC15లోని సీనియర్‌ రామ్‌చరణ్‌కు సంబంధించిన లుక్‌ అంటూ లీకైంది. ఇదిలా ఉంటే ఈ మూవీ ఇంటీవల రాజమండ్రిలో షూటింగ్‌ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం షూటింగ్‌ బ్రేక్‌ ఇవ్వగా త్వరలోనే సెకండ్‌ షెడ్యూల్‌ ప్రారంభం కానుందట. అయితే ఈ షెడ్యూల్‌ షూటింగ్‌ దుబాయ్, హైదరాబాద్‌లో జరగనుందని వినికిడి. 

మరిన్ని వార్తలు