సవాల్‌కి రెడీ

9 Sep, 2020 02:49 IST|Sakshi

సరికొత్త సవాళ్లను స్వీకరిస్తేనే మనలోని ప్రతిభ బయటపడుతుంది అంటున్నారు సమంత. ఇటీవల ఓ సందర్భంలో ‘‘నటిగా నాకు ఎలాంటి భయాలు లేవు.. ఎంతటి క్లిష్టమైన పాత్ర అయినా సరే చేయాలనుకుంటాను’’ అన్నారామె. ‘మహానటి, రంగస్థలం, ఓ బేబీ’ తదితర చిత్రాల్లో చాలెంజింగ్‌ రోల్స్‌ చేశారు సమంత. తాజాగా మరో చాలెంజింగ్‌ పాత్రకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని సమాచారం. ‘మయూరి, గేమ్‌ ఓవర్‌’ చిత్రాలను తెరకెక్కించిన అశ్విన్‌ శరవణన్‌ దర్శకత్వంలో ఓ తెలుగు–తమిళ ద్విభాషా చిత్రంలో బధిర యువతిగా నటించనున్నారట సమంత. సైకలాజికల్, హారర్‌ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టాక్‌. ‘మహానటి’లో నత్తి ఉన్న అమ్మాయిగా నటించారు సమంత. ఆ పాత్రను అద్భుతంగా చేశారు. ఇప్పుడు మూగ, చెవిటి అమ్మాయిగా నటించడానికి తగిన కసరత్తులు చేస్తున్నారని తెలిసింది. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు