రియాలిటీ షో: వారిద్దరూ కలిసుండటం లేదా!

28 Nov, 2020 20:43 IST|Sakshi

ముంబై: ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ తాజా రియాలిటీ షో ‘ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్’ శుక్రవారం ప్రారంభమైంది. ప్రముఖ బాలీవుడ్‌ నటుల భార్యల నిజ జీవితంగా ఆధారంగా ఈ రియాలీటీ షో తెరకెక్కుతోంది. ఈ షోలో కథానాయికలుగా మహీప్ కపూర్, నీలం కొఠారి సోని, భావన పాండేలతో పాటు సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు సోహైల్‌ ఖాన్‌ భార్య సీమా ఖాన్‌లు నటిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం టెలికాస్ట్‌ అయిన తొలి ఎపీసోడ్‌ ప్రేక్షకులను కన్‌ఫ్యూజన్‌లోకి నెట్టెసింది. అయితే ఈ షో తొలి ఎపీసోడ్‌లో సోహైల్‌ ఖాన్‌.. భార్య సీమా ఖాన్‌ ఇంటికి వచ్చినట్లు చూపించారు. సోహైల్‌ వచ్చాడని అనుకుంటూ  అని సీమా అనుకుంటుంది. దీంతో సీమా, సోహైల్‌లు ఎందుకు వేర్వేరు ఇళ్లలో నివసిస్తున్నారని అని నెటిజన్‌లలో అనుమానం మొదలైంది. వీరిద్దరి రిలేషన్‌పై సోషల్‌ మీడియాలో చర్చ మొదలైంది. అంతేగాక నాలుగవ ఎపిసోడ్‌లో ఆమె పెద్ద కుమారుడు నిర్వాన్‌ కూడా వస్తాడు. అతను కొత్తగా రెనోవెట్‌ చేసిన సీమ ఇంటిని పరిశీలిస్తుంటాడు. ఈ నేపథ్యంలో సీమా నిర్వాన్‌తో.. ‘నువ్వు ఎక్కువ సమయంలో నాతోనే ఉండాలని కొడుకును కోరుతుంది. దీంతో నిర్వాన్‌ రోజు నిన్ను చూడటానికి వస్తూనే ఉంటాను అమ్మ ’అని చెప్పడంతో నెటిజన్‌ల మరిన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. (చదవండి: నువ్వు చేసింది అనైతికం..)

ఇక నిర్వాన్‌ తనతో ఉండడు అని సీమా బాధపడుతుంటే అతడు ‘నేను సముద్రాల అవతల నివసించడం లేదమ్మ.. అమ్మ పక్క వీధిలోనే ఉంటున్నాను’ అని సీమాతో చెబుతాడు. దీంతో ‘‘నేను నిర్వాన్‌ను ఎప్పుడూ చూడలేను. అతను ఎక్కవగా తన తండ్రితోనే కలిసుంటాడు. కేవలం ఇక్కడ నిద్రపోతాడంతే. నిర్వాన్ విషయంలో నన్ను అంత్యంత బాధించే విషయాలలో ఇది ఒకటి’’ అని సీమా కెమారా ముందు  వాపోతుంది. దీంతో నెటిజన్‌లు సీమా‌-సోహైల్‌ ఖాన్‌లు విడిపోయారా అని సోషల్‌ మీడియాలో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక వారిద్దరూ కలిసి లేనప్పుడు ఆమెను బాలీవుడ్‌ వైఫ్‌ అని పిలవడం సరైనదేనా అంటూ నెటిజన్‌ ట్విటర్‌ వేదికగా ప్రశ్నలు సంధిస్తున్నారు. అంతేగాక ఓ సన్నివేశంలో సీమా.. సోహైల్‌ను సంప్రదాయా వివాహం చేసుకోలేదని చెబుతుంది. ‘అంటే వారికి వివాహం కాలేదా?.. వారిద్దరూ సహాజీవనం చేస్తున్నారా? అలాంటప్పుడు సీమా బాలీవుడ్‌ వైఫ్‌ కాదు కదా’ అంటూ నెటిన్‌లు కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే ప్రముఖ బాలీవుడ్ నటుల‌ భార్యల లైఫ్‌స్టైల్‌ను తెరపై చూపించే నేపథ్యంలో నిర్మాత కరణ్‌ జోహార్‌ ‘ఫ్యాబులస్‌ లైఫ్స్‌ ఆఫ్‌ బాలీవుడ్‌ వైవ్స్‌’ వెబ్‌ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నాడు. (చదవండి: ఆమె ‘ఆది పురుష్’‌ సీత.. త్వరలో ప్రకటన!)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా