‘రాధికా ఆప్టేను బహిష్కరించండి’.. అసలు కారణం ఇదే!

13 Aug, 2021 08:38 IST|Sakshi

Boycott Radhika Apte Trend: బాయ్‌కాట్‌ రాధికా ఆప్టే.. హఠాత్తుగా పుట్టుకొచ్చిన ఈ హాష్‌ట్యాగ్‌ ప్రస్తుతం ట్విటర్‌ను ట్రెండింగ్‌ ద్వారా కుదిపేస్తోంది. వెల్లువలా వేల కొద్దీ ట్వీట్లు ఆమెకి వ్యతిరేకంగా పోస్ట్‌ అవుతున్నాయి. భారత సంప్రదాయాలను కించపరిచేలా 35 ఏళ్ల రాధిక నటిస్తోందన్నది ఆ ట్వీట్లు చేసేవాళ్ల ప్రధాన అభ్యంతరం. అంతేకాదు ఇంతలా దిగజారుతున్న వాళ్లకు అవకాశాలిచ్చి మరీ ప్రొత్సహిస్తున్న బాలీవుడ్‌పైన గరం అవుతున్నారు ట్విటర్‌ యూజర్లు.  

రాధికా ఆప్టే బాలీవుడ్‌లో బోల్డ్‌ నటిగా పేరు సంపాదించుకుంది. హిందీ చిత్రం ‘వహ్‌! లైఫ్‌ హో తో ఐసీ!’(2005) ద్వారా సినిమాల్లోకి అడుగుపెట్టిన రాధిక.. తెలుగులో రక్త చరిత్ర రెండు పార్ట్‌లు, ధోనీ, లెజెండ్‌, లయన్‌ లాంటి సినిమాల్లోనూ నటించింది. ఇక బాలీవుడ్‌లో న్యూడ్‌, సెమీ న్యూడ్‌ సీన్లతో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది రాధిక. మరోపక్క మీటూ ఉద్యమానికి మద్ధతు తెలిపే క్రమంలో ఎన్నో సంచలన స్టేట్‌మెంట్లు కూడా ఇచ్చింది. 

అయితే కేవలం డబ్బు కోసమే రాధికా ఆప్టే నటిస్తోందని, భారత సంప్రదాయాలకు వ్యతిరేకంగా ముందుకెళ్తోందని, విలువలు విడిచిపెట్టి మరీ దిగజారిందని  విమర్శలకు దిగారు కొందరు. ఇక అలాంటి వాళ్లకు అవకాశాలు ఇవ్వకూడదని బాలీవుడ్‌ను మరికొందరు కోరుతుండగా.. వాళ్ల సినిమాలు చూడడం మానేస్తే సరిపోతుందని సలహాలు ఇస్తున్నారు మరికొందరు.

చదవండి: కుప్పలుగా షూటింగ్‌కు జనం.. సినిమా యూనిట్‌కు ఫైన్‌

బాలీవుడ్‌లో అత్యాచార ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినప్పుడు కొందరు బాలీవుడ్‌ తారలు ‘న్యాయం కోసం’ అంటూ ముందుకు రావడం తెలిసిందే. అయితే  వ్యాపారవేత్త, బాలీవుడ్‌ ప్రముఖ ఫైనాన్షియర్‌ రాజ్‌కుంద్రా ‘పోర్న్‌ రాకెట్‌’ విషయంలో మాత్రం సైలెంట్‌గా ఉండిపోయారు. దీంతో కొందరు నెటిజన్స్‌.. రాధికతో పాటు మరికొందరు తారలను తెర మీదకు తెచ్చి విమర్శలకు దిగారు. ఈ క్రమంలోనే రాధికకు సంబంధించి న్యూడ్‌, సెమీ న్యూడ్‌ సీన్ల ప్రస్తావన లేవనెత్తి ఈ #BoycottRadhikaApte ట్రెండ్‌ను నడిపిస్తున్నారు.

మరిన్ని వార్తలు