చిరంజీవి కోసం టైటిల్‌ త్యాగం చేసిన డైరెక్టర్‌

7 Aug, 2021 18:24 IST|Sakshi

ఇటీవల డైరెక్టర్‌ సంపత్‌ నంది మెగాస్టార్‌ చిరంజీవిని కలిసి భేటి అయిన ఫొటోలు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశం అయ్యాయి. వరుస సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీగా ఉన్న చిరును సంపత్‌ నంది కలవడం టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. దీంతో ఆయనతో చిరు ఓ మూవీ చేయబోతున్నాడా? అనే ప్రచారం కూడా మొదలైంది. దీంతో వీరిద్దరి కాంబినేషన్‌లో క్రేజీ ప్రాజెక్ట్‌ ఉండబోతుందని అభిమానులంతా మురిసిపోతున్నారు. ఈ నేపథ్యంలో వీరి భేటీ వెనుక కారణంగా ఎంటన్నది తాజాగా బయటకు వచ్చింది. కాగా చిరు నటిస్తున్న లూసిఫర్‌ మూవీ టైటిల్‌ విషయంపై సంపత్‌ నంది, చిరుతో సమావేశం అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే మోహన్‌ రాజా దర్శకత్వంలో చిరు లూసిఫర్‌ రీమేక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ మూవీకి కింగ్‌ మేకర్‌ అనే టైటిల్‌ పరీశీలించారు మేకర్స్‌. దీనితో పాటు ‘గాడ్‌ ఫాదర్‌’ అనే టైటిల్‌ కూడా పరిశీలనకు వచ్చింది. ఇక గాడ్‌ ఫాదర్‌ టైటిల్‌నే ఖరారు చేయాలని దర్శక-నిర్మాతలు నిర్ణయించారు. అయితే ఈ టైటిల్‌ను ఇప్పటికే ఓ దర్శకుడు రిజిస్టర్‌ చేసుకున్నట్లు తెలిసి ఆయన ఎవరా.. అని ఆరా తీయగా అది సంపత్‌ నంది అని తెలిసింది. దాంతో ఈ టైటిల్‌ ఇవ్వాల్సింది నేరుగా చిరు సంపత్‌ నందిని అడగడంతో ఆయన వెంటనే టైటిల్‌ను ఇచ్చేశాడట.

చిరు అడగ్గానే ఏమాత్రం ఆలోచించకుండా టైటిల్‌ను త్యాగం చేశాడట సంపత్‌ నంది. ఈ విషయంపైనే చిరుతో చర్చించేందుకు ఆయన ఇంటికి వెళ్లి చిరు కలిశాడట. అక్కడ ఆయనతో కాసేపు ముచ్చటించి, సెల్ఫీ తీసుకున్న ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో అవి వైరల్‌ అయ్యాయి. ‘ఏమైంది ఈవేళ’ మూవీతో డైరెక్టర్‌గా పరిచయమయ్యాడు సంపత్‌ నంది. ఆ తర్వాత రామ్‌ చరణ్‌ ‘రచ్చ’ మూవీకి డైరెక్టర్‌గా వ్యవహరించాడు. ఈ మూవీ కమర్షియల్‌ హిట్‌ అందుకుంది. ఇక పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌తో ‘గబ్బర్‌ సింగ్‌ 2’ తీయాలనుకుని కొద్దిలో ఛాన్స్‌ కొద్దిలో మిస్సైయాడు సంపత్‌ నంది. ఆయనతో ఈ మూవీ స్టార్ట్‌ చేసిన పవన్‌.. మొదట్లోనే ఈ సినిమాను ఆపేశాడట. 

మరిన్ని వార్తలు