Dhanush- Aishwaryaa Divorce: వారం రోజుల్లోనే అంతా తలకిందులైందా?

21 Jan, 2022 18:34 IST|Sakshi

ధనుష్‌-ఐశ్వర్యల విడాకుల వ్యవహారం తమిళనాట హాట్‌టాపిక్‌గా మారింది. 18ఏళ్లు కలిసున్న ఈ స్టార్‌ కపుల్‌ అనూహ్యంగా విడిపోతున్నట్లు ప్రకటించడానికి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. నిజానికి ఐశ్వర్య ధనుష్‌ కంటే రెండేళ్లు పెద్ద. కాదల్ కొండై సినిమా సమయంలో ఏర్పడిన వీరి పరిచయం ప్రేమ దాకా వెళ్లింది. అలా ఇరు వర్గాల పెద్దలను ఒప్పించి 2004లో ఈ జంట పెళ్లి చేసుకున్నారు. వీరికి యాత్రా రాజా (15 ఏళ్లు), లింగ రాజా (11) అని ఇద్దరు కుమారులు ఉన్నారు.

ఎంతో అన్యోన్యంగా సాగుతున్న వారి జీవితంలో కొన్నాళ్ల క్రితమే విభేదాలు వచ్చాయని, కానీ మామ(రజనీకాంత్‌)జ్యోక్యంతో గొడవలు సద్దుమణిగాయని కోలీవుడ్‌ టాక్‌. ఇటీవలె ధనుష్‌ నటించిన అసురన్‌ చిత్రానికి నేషనల్‌ అవార్డును సంపాదించగా, అదే సమయంలో రజనీ దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డును అందుకున్నారు. దీనికి సంబంధించిన ఓ ఫోటోను సైతం ఐశ్వర్య షేర్‌ చేస్తూ.. ఇద్దరూ నా వాళ్లు అంటూ సంతోషంతో పొంగిపోయింది.

ఆ తర్వాత రజనీకాంత్‌ అస్వస్థతకు గురైన సమయంలో కూడా ధనుష్‌ దగ్గరుండి మామగారికి సేవలు చేసినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఈనెలలోనే ప్రారంభమైన ధనుష్‌ ఫస్ట్‌ స్ట్రెయిట్‌ మూవీ 'సార్‌' చిత్ర షూటింగ్‌కి సైతం ఐశ్వర్య హాజరైంది. ఇప్పటివరకు బాగానే ఉన్నా అంతలోనే విడాకులు ప్రకటించి అనూహ్యంగా షాక్‌ ఇచ్చారు ఈ కోలీవుడ్‌ కపుల్‌. 

 

మరిన్ని వార్తలు