డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ‘రెబెల్స్ ఆఫ్ తుపాకుల గూడెం’

24 Jan, 2023 15:55 IST|Sakshi

ఆడియెన్స్ సినిమాలను చూసే ధోరణి మారిపోయింది. ప్రస్తుతం కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రెబెల్స్ ఆఫ్ తుపాకుల గూడెం అనే చిత్రం రాబోతోంది. వారధి క్రియేషన్స్ ప్రై.లి. బ్యానర్ మీద ఈ సినిమాను జైదీప్ విష్ణు దర్శకుడిగా తెరకెక్కిస్తున్నాడు. ప్రవీణ్‌ కండెలా, శ్రీకాంత్ రాథోడ్, జాయెత్రి మకానా, శివరామ్ రెడ్డి ఇలా నలభై మంది కొత్త నటీనటులతో ఈ చిత్రం తెరకెక్కుతుంది. . 

ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు తాజాగా పూర్తయ్యాయి. సెన్సార్ నుంచి ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లు చిత్ర యూనిట్‌ పేర్కొంది. ఫిబ్రవరి 3న ఈ చిత్రం విడుదల కాబోతున్నట్టుగా మేకర్లు ప్రకటించారు. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్‌లో అన్ని కారెక్టర్లను చూపించారు. 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు