ఫిబ్రవరి 3న ‘రెబెల్స్ ఆఫ్ తుపాకులగూడెం’ మూవీ రిలీజ్‌

30 Jan, 2023 15:59 IST|Sakshi

నలభై మంది కొత్త నటీనటులతో రాబోతోన్న చిత్రం ‘రెబెల్స్ ఆఫ్ తుపాకులగూడెం’. ఇందులో ప్రవీణ్‌ కండెలా, శ్రీకాంత్ రాథోడ్, జయెత్రి మకానా, శివరామ్ రెడ్డిలు ప్రధాన పాత్రలో నటించిన చిత్రాన్ని వారధి క్రియేషన్స్ ప్రై.లి. బ్యానర్ మీద ఈ సినిమాను జైదీప్ విష్ణు దర్శకుడిగా తెరకెక్కిస్తున్నాడు. సంతోష్ మురారికర్ కథ అందించడమే కాకుండా కో డైరెక్టర్‌గానూ పని చేసిన ఈ చిత్రం ఫిబ్రవరి 3న రాబోతోంది. ఈ క్రమంలో ఆదివారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో చిత్రయూనిట్ పంచుకన్న విశేషాలు ఇవే.  

డైరెక్టర్ జైదీప్ విష్ణు మాట్లాడుతూ.. 'నాకు ఎంతో మంచి టీం దొరికింది. వారి వల్లే సినిమాను ఎంతో బాగా తీయగలిగాను. నాలుగు నెలల పాటుగా నాతోనే ఉంది. మ్యాగీ, దీక్షిత్‌లు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. వినయ్ లేటుగా వచ్చాడు. ఈ ముగ్గురూ కలిసి సినిమాను బాగా హ్యాండిల్ చేశారు. మా ఊరోడు సినిమా తీస్తున్నాడని, మాకు ఊరు ఊరంతా సాయం చేసింది. తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాకు ఎంతో సాయం చేసింది. నా ఇద్దరు హీరోలు, హీరోయిన్లకు థాంక్స్. ఈ సినిమాకు మ్యూజిక్ విషయంలో ఇబ్బంది పడ్డాం. మణిశర్మ గారి వద్దకు వెళ్లాక ఆ సమస్య తీరిపోయింది. నాలుగు పాటలు నాలుగు రోజుల్లోనే ఇచ్చారు.

లిరిక్స్ ఇచ్చిన వెంటనే పాటలు వచ్చేశాయి. కాసర్ల శ్యామ్‌ లేకపోతే మాకు మణిశర్మ గారు దొరికేవారు కాదు. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్.  హీరోయిన్ పాత్రను రాసినప్పుడే తెలంగాణ అమ్మాయినే తీసుకోవాలని అనుకున్నాం. తెలంగాణ యాసలో మాట్లాడే అమ్మాయి అయితేనే బాగుంటుందని జయెత్రిని తీసుకున్నాం. మా సినిమా ఫిబ్రవరి 2న యూఎస్‌లో విడుదలవుతోంది. ఫిబ్రవరి 3న రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదలవుతోంది. థియేటర్లో ఈ సినిమాను చూడండి' అని అన్నారు. అనంతరం మెలోడి బ్రహ్మ మణిశర్మ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా అంతా అయిపోయిన తరువాత నాకు ఒక విషయం అర్థమైంది. దర్శకుడు కనిపించినంత సాఫ్ట్ ఏం కాదు. మేం అంతా కలిసి కొత్తగా ట్రై చేశాం. ఆడియెన్స్ సినిమాను చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

మరిన్ని వార్తలు