అమెజాన్ చేతికి 'ఎఫ్ 3' డిజిటల్ రైట్స్

13 Jan, 2021 10:43 IST|Sakshi

టాలీవుడ్ లో ఒకటి మూవీ హిట్ అయితే గొప్పగా చెప్పుకుంటారు.. అలాంటిది ఆ డైరెక్టర్ తెరకెక్కించిన చిత్రాలు వరుసగా ఐదు హిట్ అయ్యాయి. దాంతో ఆ డైరెక్టర్ రేంజ్ మారిపోయింది. ఇప్పుడు అతను తీయబోయే కొత్త సినిమాలకు రెమ్యూనరేషన్ ని కూడా పెంచాడట. ఆయన మరెవరో కాదండి దర్శకుడు అనీల్ రావిపూడి. ఇప్పుడు దర్శకుడు అనీల్ రావిపూడి ఎఫ్ 2 యొక్క సీక్వెల్ తీసేపనిలో పడ్డారు. ఇటీవలే ఈ చిత్రం షూట్ కూడా ప్రారంభమైంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబందించిన స్టార్ కాస్ట్ వెంకటేష్ నుంచి అనిల్ రావిపూడి వరకు అందరూ తమ రెమ్యూనరేషన్ పెంచేశారు. దీంతో ఈ చిత్ర బడ్జెట్ రూ.70 కోట్లకుపైగా చేరుకున్నట్లు తెలుస్తుంది. విక్టరీ వెంకటేష్ - వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా వస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. మూడింతల వినోదంతో రాబోతున్న 'ఎఫ్ 3' పై మంచి అంచనాలే ఉన్నాయి.  

ఈ చిత్రం యొక్క నాన్-థియేట్రికల్ ఒప్పందాలను మేకర్స్ మూసివేస్తున్నట్లు తెలుస్తుంది. "ఎఫ్ 3" పై భారీ అంచనాలు ఉండటంతో డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ రికార్డ్ ధర పలుకుతున్నట్లు టాక్ నడుస్తోంది. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియో 'ఎఫ్ 3' స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకున్నట్లు సమాచారం. ఈ చిత్రం బహుళ భాషలలో విడుదల కాకపోయినప్పటికీ, డీజిటల్ హక్కులు అన్ని భాషలకు అమ్ముడైయినట్లు సమాచారం . ఈ చిత్రాన్ని 2021 దసర విడుదల చేయాలనీ చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది. బొమన్ ఇరానీ - సునీల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు