Regina : ' రెజీనా..నిన్ను ఇప్పుడే అన్‌ఫాలో చేస్తున్నాం'

22 Oct, 2021 15:17 IST|Sakshi

Regina Cassandra Trolled For Promoting Whiskey: సాధారణంగా సెలబ్రిటీలు ఓవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు యాడ్స్‌ చేస్తూ రెండు వైపులా సంపాదిస్తుంటారు. అయితే ఒక్కోసారి వాళ్లు చేసే ప్రమోషన్స్‌ వివాదాస్పదం అవుతుంటాయి. తాజాగా హీరోయిన్‌ రెజీనా కసాండ్రాకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది.  ఓ కంపెనీ అల్కహాల్‌ను ప్రమోట్‌ చేస్తూ చేతిలో మందు గ్లాసు పట్టుకొని స్టైల్‌గా ఫోజిచ్చిన రెజీనా ఇన్‌స్టా పోస్ట్‌పై నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు.

డబ్బుల కోసం ఇలాంటి పనులు చేస్తావా అంటూ ఆమెను దుమ్మెత్తిపోస్తున్నారు. మధ్యపానం అనారోగ్యమని తెలిసినా డబ్బుల కోసం ఇలా ప్రమోట్‌ చేస్తారా అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  మరో నెటిజన్‌ అయితే.. ఈ ఫోటో చూశాక మీ మీద గౌరవం పోయింది. ఇప్పుడే మిమ్మల్ని అన్‌ఫాలో అవుతున్నాను అంటూ కామెంట్‌ చేశారు. ఇక ఇటీవలె పొగాకు బ్రాండ్‌ను ప్రమోట్‌ చేస్తున్నందుకు అమితాబ్‌పై విమర్శలు రావడంతో ఆ యాడ్‌ నుంచి ఆయన తప్పుకున్న సంగతి తెలిసిందే. 

A post shared by Regina Cassandra (@reginaacassandraa)


 

మరిన్ని వార్తలు