రేణూ రీ ఎంట్రీ

16 Oct, 2020 00:45 IST|Sakshi

‘బద్రి, జానీ’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన రేణూ దేశాయ్‌ ‘ఆద్య’ అనే ఒక పవర్‌ఫుల్‌ లేడీ ఓరియంటెడ్‌ ప్యాన్‌ ఇండియా చిత్రంతో తన సెకండ్‌ ఇన్నింగ్స్‌కి శ్రీకారం చుడుతున్నారు. ఈ సినిమాతో ఎం.ఆర్‌. కృష్ణ మామిడాల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. డి.ఎస్‌.కె. స్క్రీన్‌–సాయికృష్ణ ప్రొడక్ష¯Œ ్స బ్యానర్స్‌పై రావ్‌. డి.ఎస్‌–రజనీకాంత్‌. ఎస్‌ నిర్మించనున్నారు. ‘హుషారు’ ఫేమ్‌ తేజ కురపాటì,, గీతికా రతన్‌ జంటగా నటించనున్న ఈ చిత్రంలో ‘కబాలి’ ఫేమ్‌ సాయి ధన్సిక, నందినీ రాయ్‌ ముఖ్యపాత్రల్లో నటించనున్నారు. ఈ సందర్భంగా రజనీకాంత్‌ .ఎస్‌ మాట్లాడుతూ– ‘‘విజయదశమి రోజున మా ‘ఆద్య’ సినిమా ప్రారంభిస్తాం. రేణూ దేశాయ్‌ రీ ఎంట్రీ ఇస్తున్న ఈ చిత్రం జాతీయ స్థాయిలో అందరి దృష్టినీ  ఆకర్షించేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం’’ అన్నారు. బాలీవుడ్‌ హీరో వైభవ్‌ తత్వవాడి ప్రత్యేక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రానికి కెమెరా: శివేంద్ర దాశరధి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కృష్ణ చైతన్యరెడ్డి .ఎస్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు