పవన్‌ ఫొటో షేర్‌ చేసిన రేణు దేశాయ్‌

2 Dec, 2020 14:45 IST|Sakshi

ముంబై: రేణు దేశాయ్‌.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ‘బద్రి’ సినిమాలో పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌కు జోడిగా నటించిన ఆమె పవన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వార్దిదరూ విడిపోయి వేరుగా ఉంటున్నారు. వీరికి కుమారుడు అకిరా నందన్‌, కూతురు ఆధ్యలు ఉన్న విషయం తెలిసిందే. అయితే పవన్‌, రేణులు విడిపోయినప్పటికి తామీద్దరం స్నేహితులమేనని, తాము ఎప్పుటికి మంచి శ్రేయోభిలాషులుగా ఉంటామంటూ రేణు పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అంతేగాక పవన్‌ కూడా అప్పడప్పుడు వారి దగ్గరికి వెళుతుంటారని పిల్లలతో సరదాగా సమాయాన్ని గుడుపుతుంటారని ఆమె చెప్పేవారు. ఈ క్రమంలో పవన్‌ కల్యాణ్‌ కొడుకు అకిరా, కూతురు ఆధ్యలను ఒళ్లో కూర్చోపెట్టుకున్న బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోను రేణు దేశాయ్‌ బుధవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. (చదవండి: లగ్జరీ కార్లను అమ్మేసిన రేణు దేశాయ్..)  

A post shared by renu desai (@renuudesai)

ఈ ఫొటోకు రేణు.. ‘కొన్ని మధురమైన జ్ఞాపకాలకు సంబంధించిన ఫొటోలను పంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అరుదైన ఫొటోను నా కెమెరాలో బంధించాను. ఇలాంటి అందమైన ఫొటోలు కేవలం నా ఫోన్‌ గ్యాలరీకే పరిమితం కాకుడదని షేర్‌​ చేశాను’ అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కూతురు, కొడుకును ఇరువైపుల కూర్చొపెట్టుకుని వారిని ముద్దాడుతున్న పవన్‌ ఫొటో నెటిజన్‌లను తెగ ఆకట్టుకుంటోంది. అయితే పవన్‌తో విడిపోయిన అనంతరం రేణు దేశాయ్‌ తన పిల్లలిద్దరితో కలిసి పుణేలో సెటిల్‌ అయిపోయారు. తల్లిగా పిల్లల బాధ్యతను ఆమె చూసుకుంటున్నారు. రేణు ప్రస్తుతం మరాఠి సినిమాలను నిర్మిస్తూ.. ఇటూ తెలుగు టీవీ షోలకు జడ్జీగా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నారు. అంతేగాక సినిమాల్లో తిరిగి నటించనున్నట్లు ఇటీవల ఆమె వెల్లడించారు. (చదవండి: మళ్లీ వస్తున్నా, ఆశీర్వదించండి: రేణూ దేశాయ్‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా