మన శరీరం కేవలం అందుకోసమే కాదు కదా : రేణు దేశాయ్‌

24 Apr, 2021 08:54 IST|Sakshi

రేణు దేశాయ్..‌  సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. సమాజంలోని సమస్యలపై మాట్లాడటంలో, తన అభిప్రాయాలు పంచుకోవడంలో ముందుంటారామె. తాజాగా కరోనా పరిస్థితిపై ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన స్టైల్‌లో స్పందించారు. 'బాధలు, ద్వేషం వంటి వాటిని లెక్కలేనంతగా మోసి మోసి మనం గాడిదల్లా తయారవుతున్నాం. కానీ కేవలం భాధ పడటానికి ఈ శరీరం లేదు కదా.. బాధల్లో కూడా చిన్న చిన్న సంతోషాలను వెతుక్కొని ఆనందంగా ఉండాలి. మనమంతా ఇప్పుడు చావు, బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాం.

అయితే సంతోషంగా ఉండటానికి ఏది అవసరమో అది చేయండి. స్టాండప్‌ కామెడీ వీడియోలు కానీ, క్యూట్‌ పప్పీ(కుక్కపిల్ల)ల వీడియోలు చూడండి. ఈ కష్టకాలం కూడా ఎక్కువ రోజులు ఉండదు అది వెళ్లిపోవాల్సిందే. అదే కాలానికి ఉన్న గొప్పదనం. అదే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. జాగ్రత్తలు పాటించండి. సురక్షితంగా ఉండండి' అంటూ ఎంతో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం రేణు దేశాయ్‌ బుల్లితెరపై ఓ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. 

A post shared by renu (@renuudesai)

చదవండి : వైరల్‌ : పవన్‌ కల్యాణ్‌తో ఫోటో షేర్‌ చేసిన రేణు దేశాయ్‌
హాట్‌ టాపిక్‌గా మారిన పవన్‌ కల్యాణ్ రెమ్యూనరేషన్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు