కొత్త తరహా సినిమాలను ఆదరిస్తారు

17 Jul, 2022 03:53 IST|Sakshi
రామసత్యనారాయణ, రామ్‌గోపాల్‌ వర్మ, అంజయ్య

– రామ్‌గోపాల్‌ వర్మ

‘‘ఎంటర్‌ ది డ్రాగన్‌’ సినిమా చూసినప్పటి నుంచి అలాంటిది చేయాలనుకున్నాను. అందుకే ‘అమ్మాయి’ సినిమా నా కలల ప్రాజెక్ట్‌. పూజా భాలేకర్‌ లాంటి మార్షల్‌ ఆర్ట్స్‌ తెలిసిన అమ్మాయి దేశంలోనే లేరు. కొత్త తరహా సినిమాలు తీస్తే ఆదరిస్తామని మరోసారి ‘అమ్మాయి’ సినిమాతో ప్రేక్షకులు నిరూపించారు’’ అని డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మ అన్నారు.

పూజా భాలేకర్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘లడ్కీ’ (తెలుగులో ‘అమ్మాయి’). టి. అంజయ్య, శ్రేష్ఠ పటేల్‌ మూవీస్‌ సమర్పణలో రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కించిన ‘అమ్మాయి’ చిత్రం శుక్రవారం విడుదలైంది.

ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో టి. అంజయ్య మాట్లాడుతూ– ‘‘ఆర్జీవీ (రామ్‌గోపాల్‌ వర్మ)గారు తీసిన ‘శివ’ తర్వాత ‘అమ్మాయి’ సినిమానే పెద్ద హిట్‌ అయింది. ఈ సినిమాకు సీక్వెల్‌ తీయమంటున్నారు. ఆ చిత్రాన్ని నేనే నిర్మిస్తా’’ అన్నారు. ‘‘అమ్మాయి’ వంటి మంచి హిట్‌ ఇచ్చిన ఆర్జీవీ, అంజన్నగార్లకు థ్యాంక్స్‌’ అని అన్నారు నిర్మాత రామ సత్యనారాయణ.

మరిన్ని వార్తలు