వైరల్‌ : హైదరాబాద్‌ మేయర్‌పై ఆర్జీవీ సెటైర్లు

5 Mar, 2021 20:57 IST|Sakshi

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ..తాజాగా హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మిపై కూడా తనదైన స్టయిల్‌లో పంచులేశాడు. వివరాల్లోకి వెళితే..హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి ఇటీవలె ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్‌చేసింది. అందులో తన కుక్కకి కుడిచేత్తో తినిపిస్తూ..తాను మాత్రం ఎడమ చేత్తో తింటుంది. దీనిపై స్పందించిన వర్మ..'నిస్వార్థ ప్రేమకు ఇది నిదర్శనం. తన కుక్కకు కుడి చేత్తో తినిపిస్తూ..తాను మాత్రం ఎడమ చేత్తో తింటుంది. ఆమెకు కుక్కపై ఉన్న ప్రేమ ఎంతో  ఉన్నతంగా అనిపిస్తుంది. తక్షణమే ఆమెను  అంతర్జాతీయ కుక్కల మేయర్‌గా ఎంపిక చేయాలి. ఇంతగా ఆమె తన కుటుంబాన్ని, తన పార్టీని, తెలంగాణ ప్రజలను కూడా ప్రేమిస్తారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

కుక్కపై చూపిస్తున్న ప్రేమలో  ఒక్కశాతం అయినా తెలంగాణ ప్రజలపై ఉందా? ఈ కుక్కను చూసి వాళ్లంతా ఇప్పుడు ఈర్ష్య పడుతుంటారు. కుక్కపై ఆమె చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే.. వచ్చే జన్మలో నేను ఆమె కుక్కగా పుట్టాలని కోరుకుంటున్నాను' అని ట్వీట్‌ చేశాడు. దీనిపై నెటిజన్లు భిన్న రీతుల్లో స్పందిస్తున్నారు. కుక్కపై మేయర్‌కున్న ప్రేమను కొందరు ప్రశంసిస్తుంటే, మరొకొందరు మాత్రం తప్పుబడుతున్నారు. 

చదవండి : (జీతాలివ్వకుండా వేధిస్తున్న ఆర్జీవీ!)
(డ్రగ్స్‌ ఎలా తీసుకోవాలో ఆ నటుడు నేర్పించారు)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు