RGV Tweet On Prabhas Fans: ప్రభాస్ ఫ్యాన్స్‌తో అట్లుంటది మరి.. ఆర్జీవీ ట్వీట్ వైరల్

23 Oct, 2022 21:11 IST|Sakshi

ప్రభాస్‌ బర్త్‌డే సందర్భంగా అభిమానులు సృష్టించిన రచ్చ అంతా ఇంతా కాదు. రెబల్ పుట్టినరోజు సందర్బంగా బిల్లా సినిమాను పలు థియేటర్లలో రీ రిలీజ్ చేశారు. దీంతో థియేటర్లకు భారీగా చేరుకున్న అభిమానులు దీపావళి పేల్చినట్లు టపాసులు కాల్చి రచ్చ చేశారు.  పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని వెంకట్రామ థియేటర్‌లో బాణాసంచా పేల్చడంతో అగ్నిప్రమాదం చేటుచేసుకుంది.  ఫ్యాన్స్‌ అత్యుత్సాహమే దీనికి కారణం. సీట్లకు మంటలు వ్యాపించడంతో  అభిమానులు బయటకు పరుగులు తీశారు. అయితే ఈ సంఘటనపై తాజాగా సంచలన దర్శకుడు ఆర్జీవీ స్పందించారు. తనదైన శైలిలో ప్రభాస్ అభిమానుల చర్యను అభివర్ణించారు. ఇంతకీ ఏమన్నారంటే..!

(చదవండి: అరాచకం.. థియేటర్‌లో బాణాసంచా పేల్చిన ప్రభాస్‌ ఫ్యాన్స్‌)

ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసిన ఆర్జీవీ ఇలా రాసుకొచ్చారు. ' అక్కడ జరుగుతున్నది దీపావళి వేడుక కాదు. ప్రభాస్ సినిమా తెరపై ప్రదర్శిస్తుండగా థియేటర్‌లోనే బాణాసంచా కాల్చి సంబురాలు చేసుకోవడం. ఇది ప్రభాస్  అభిమానుల పిచ్చి చర్య. ఆయన ఫ్యాన్స్ జరుపుకున్న దీపావళి పండుగ స్టైల్ ఇది' అంటూ ట్వీట్ చేశారు.  అయితే సినిమా చూస్తూ థియేటర్‌లో బాణసంచా పేల్చడంతో యాజమాన్యం, అభిమానులు మంటలు ఆర్పేశారు. అయితే షో మధ్యలో ఆపినందుకే ఇలా చేశామని కొందరు ఫ్యాన్స్‌ చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు