RGV Tweets: అలాంటి వారంతా స్టార్‌ హీరోలవ్వాలి: ఆర్జీవీ

31 Dec, 2022 17:53 IST|Sakshi

రాంగోపాల్ వర్మ అటు బాలీవుడ్.. ఇటూ టాలీవుడ్‌లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఎందుకంటే ఆయన చేసే పనులతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇండస్ట్రీలో వివాదస్పద దర్శకుడిగా ముద్ర వేసుకున్నారు ఆర్జీవీ. తాజాగా మరోసారి హాట్‌ టాపిక్‌గా మారారు. అందరు ఒకలా చేస్తే తాను మాత్రం డిఫరెంట్‌ అని మరోసారి రుజువు చేశారు. ఈ ఏడాది చివరి రోజు కావడంతో తనదైన శైలిలో అడ్వాన్స్‌ విష్ చేశారు ఆర్జీవీ. తాజాగా ఆర్జీవీ చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

ఆర్జీవీ తన ట్వీట్‌లో ప్రస్తావిస్తూ.. '31 డిసెంబర్ 2022 వరకు ఉన్న సమస్యలన్నీ మీరు 1 జనవరి 2023న నిద్రలేచిన తర్వాత కూడా కొనసాగుతాయి. ఎందుకంటే అదే భార్య, అదే భర్తనే ఉంటారు కావున. అలాగే.. ఈ ఏడాది నేరస్తులంతా పోలీసులకు పట్టుబడకూడదని, అన్ని వ్యాక్సిన్‌ తట్టుకునే ఇమ్యూనిటీని కరోనా వైరస్‌కు ఇవ్వాలని, కొత్త సంవత్సరంలో మరిన్ని వైరస్‌లు విజృంభించాలని, కష్టాల్లో ఉన్న నటీనటులందరూ షారుక్ ఖాన్, సల్మాన్, అమీర్‌ల కంటే పెద్ద స్టార్‌లు అవ్వాలని కోరుకుంటున్నా. ఈ కొత్త సంవత్సరంలో భార్యలందరూ తమ భర్తలను అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నా' అంటూ పోస్ట్ చేశారు. ఇలా అందరికీ వినూత్నంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ వరుస ట్వీట్స్ చేశారు దర్శకుడు ఆర్జీవీ.

మరిన్ని వార్తలు