సుశాంత్‌ డ్రగ్స్‌ కోసం మమ్మల్ని వాడుకున్నాడు

23 Sep, 2020 12:57 IST|Sakshi

ముంబై: సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి, మాదకద్రవ్యాల వినియోగం ఆరోపణలపై ప్రస్తుతం జైలులో ఉన్న రియా చక్రవర్తికి ఆమె సోదరుడు షోవిక్‌ చక్రవర్తిలకు సంబంధించిన బెయిల్‌ పిటిషన్‌ విచారణను బాంబే హై కోర్టు రేపటికి (గురువారం) వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తన బెయిల్ పిటిషన్‌లో రియా.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాత్రమే డ్రగ్స్‌ వాడేవాడని.. అతను తన సిబ్బందిని డ్రగ్స్‌ తీసుకురావాల్సిందిగా కోరేవాడని తెలిపింది. సుశాంత్‌ జీవించి ఉంటే అతనిపై తక్కువ అభియోగాలు మోపబడేవని.. బెయిల్‌ లభించే నేరంగా ఉండేదని.. అతడికి ఒక సంవత్సరం మాత్రమే జైలు శిక్ష విధించేవారని తెలిపింది. (చదవండి: స్పీడ్‌పోస్టు, కొరియర్లలో డ్రగ్స్‌)

అంతేకాక సుశాంత్‌ తనను, తన సోదరుడిని, ఇతర సిబ్బందిని డ్రగ్‌ సప్లయర్స్‌గా వాడుకున్నాడని రియా ఆరోపించింది. ‘సుశాంత్‌ డ్రగ్స్‌ కోసం తనతో క్లోజ్‌గా ఉండే వారిని అంటే నన్ను, నా సోదరుడిని వాడుకున్నాడు. ఇందుకు సంబంధించి అతడు ఎలాంటి ఎలాక్ట్రానిక్‌ ఎవిడెన్స్‌ని వదల్లేదు. దాంతో ఆధారాలు లేవు. ఇప్పుడు మేం ఫలితం అనుభవిస్తున్నాం’ అని రియా విచారం వ్యక్తం చేసింది. పబ్లిక్ డొమైన్లోని సమాచారం ఆధారంగా రియా, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తన కుక్ నీరజ్‌ను ‘గంజా జాయింట్లు / రోల్స్ / డూబీలు తయారు చేసి తన పడకగదిలో ఉంచమని’ తన మరణానికి మూడు రోజుల ముందు కోరినట్లు వెల్లడించింది. దీని గురించి నీరజ్ సీబీఐ, ముంబై పోలీసులకు చెప్పాడని తెలిపింది. ‘తాను జాయింట్లు సిద్ధం చేసి సుశాంత్‌ బెడ్‌రూంలోని ఒక బాక్స్‌లో ఉంచానని నీరజ్‌ తెలిపాడు. సుశాంత్‌ చనిపోయిన తర్వాత ఆ బాక్స్‌ తెరిచి చూస్తే.. ఖాళీగా ఉందని.. సుశాంత్‌ జాయింట్లు / డూబీలు వాడాడని అర్థమయ్యింది అన్నది’ రియా. (చదవండి: సుశాంత్ ఫామ్‌హౌస్‌లో తరచూ పార్టీలు)

ఇక నిన్నటితో రియా జ్యూడిషియల్‌ కస్టడీ ముగిసింది. దాంతో వచ్చే నెల 6 వరకు దాన్ని పొడిగించారు. ఇప్పటికే ఆమె రెండుసార్లు బెయిల్‌కు అప్లై చేయగా.. కోర్టు తిరస్కరించింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై దర్యాప్తుకు సంబంధించిన డ్రగ్స్ ఆరోపణలపై రియా చక్రవర్తిని సెప్టెంబర్ 9 న అరెస్టు చేశారు. ఆమెను "డ్రగ్ సిండికేట్ యొక్క క్రియాశీల సభ్యురాలు" అని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అభివర్ణించింది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా