చట్టపరమైన చర్యలు తీసుకుంటా: రియా న్యాయవాది

12 Sep, 2020 16:54 IST|Sakshi

ముంబై: తనకు ఎలాంటి ట్విటర్‌ ఖాతా లేదని నటి రియా చక్రవర్తి తరపు న్యాయవాది సతీష్‌ మనేష్‌ షిండే శనివారం వెల్లడించారు. సుశాంత్ సింగ్‌‌ మృతి కేసులో రియా తరపున ఆయన వాదనలు వినిపిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇటీవల ఓ నకిలీ సమచారం సతీష్‌ మనేష్‌ షిండే పేరుపై ట్విటర్‌లో వెలువడిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన స్పందిస్తూ.. తనకు సోషల్‌ మీడియాలో ఎలాంటి ఖాతా లేదని స్ఫస్టం చేశారు. ‘డియర్‌ ఫ్రెండ్స్‌.. ట్విటర్‌తో ఇటీవల నా పేరుపై వచ్చిన ఖాతా నాది కాదు. అది నకిలీ ఖాతా. దీనిని ఎవరో అభిమాని క్రియోట్‌ చేసి ఉంటారని భావిస్తున్నాను. దీని నుంచి వచ్చే నకిలీ సమాచారం, వార్తలకు నేను బాధ్యుడిని కాదు. త్వరలోనే దీనిపై నేను చట్టపరమైన చర్యలు తీసుకుంటాను’  అని తెలిపారు. సుశాంత్‌ కేసులో రియా తరపున ఆయన కోర్టు వాదిస్తున్నారు. ఈ క్రమంలో డ్రగ్స్‌ కేసులో నేర నిరూపణ కావడంతో రియాను ముంబై మహిళ జైలుకు తరలించిన విషయం తెలిసిందే.
(చదవండి: డ్రగ్స్‌ కేసులో రియాకు షాక్‌)

ఈ క్రమంలో రియా బెయిల్‌ పిటిషన్‌ను ప్రత్యేక న్యాయస్థానం తిరస్కరించిన అనంతరం ఆమెను ముంబై హైకోర్టు తరలించవచ్చని షిండే శుక్రవారం తెలిపారు. కోర్టు ఆర్డర్‌ వచ్చిన తర్వాత తాము హైకోర్టును సంప్రదించడంపై నిర్ణయం తీసుకుంటామని షిండే పేర్కొన్నారు. డ్రగ్‌ కేసులో నార్కొటిక్స్‌ సెంట్రల్‌ బ్యూరో అధికారులు రియాను ఆమె సోదరుడు షోవిక్‌ చక్రవర్తితో పాటు మరో నలుగురిని అరెస్టు చేసి జైలు తరలించిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ తప్పుడుగా తనను ఈ కేసులో ఇరికించారని రియా తన పిటిషన్‌లో పేర్కొంది. ఎన్‌సీబీ అధికారులు ఈ కేసులో తనను ఇరికించేలా తనను బలవంతం చేసి ఒప్పించారని ఆరోపించింది. విచారణ సమయంలో తాను చేసిన నేరాంగీకార ప్రకటనను కూడా ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. ఈ కేసులో సెప్టంబర్‌ 8న అరెస్టు అయిన రియాను సెప్టెంబర్‌ 22 వరకు జ్యూడిషియల్‌ కస్టడికి పంపారు. (చదవండి: రియాకు మద్దతుగా కాంగ్రెస్ ర్యాలీ

మరిన్ని వార్తలు