డ్రగ్స్‌ కేసు: తల్లి ఫోన్‌ వాడిన రియా!

14 Sep, 2020 16:17 IST|Sakshi

ఈడీ అధికారులకు ఫోన్‌ అప్పగించని రియా!

ముంబై: డ్రగ్స్‌ కేసులో అరెస్టైన బాలీవుడ్‌ నటి రియా చక్రవర్తికి సంబంధించి పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో అధికారుల విచారణలో భాగంగా.. మాదక ద్రవ్యాల గురించి చాట్‌ చేసేందుకు ఆమె తన తల్లి సంధ్య చక్రవర్తి మొబైల్‌ ఫోన్‌ ఉపయోగించినట్లు తెలుస్తోంది. దీని ద్వారానే రియా తన స్నేహితులతో సంప్రదింపులు జరిపేదని, మరెన్నో వాట్సాప్‌ గ్రూపుల్లో ఈ ఫోన్‌ ద్వారా ఆమె కనెక్ట్‌ అయి ఉందని తమకు సమాచారం అందినట్లు ఓ ప్రముఖ జాతీయ మీడియా వెల్లడించింది. కాగా తన ప్రియుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి నేపథ్యంలో తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్న రియా.. మనీలాండరింగ్‌ కేసులో ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఎదుట విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. (చదవండి: రియాను హనీ ట్రాప్‌గా‌ ఉపయోగించారు: నటి)

అయితే అప్పుడే తన వద్ద ఫోన్లను స్వాధీనం చేసుకునే క్రమంలో రియా ఈ మొబైల్‌ను ఈడీ అధికారులకు అప్పగించలేదని తెలిసింది. ఇక ఈడీ దర్యాప్తులో భాగంగా ఇప్పటికే రియా, ఆమె సోదరుడు షోవిక్‌ చక్రవర్తికి సంబంధించిన చాట్స్‌ బహిర్గతమైన సంగతి తెలిసిందే. తాజా పరిణామాల నేపథ్యంలో రియా తల్లి సంధ్యా చక్రవర్తి ఫోన్‌ వాట్సాప్‌ గ్రూపులో ఉన్న పలువురిపై కూడా ఎన్‌సీబీ దృష్టి సారించినట్లు సమాచారం. రియాతో డ్రగ్స్‌ గురించి చాట్‌ చేసిన పలువురిని విచారించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.(చదవండి: సరిగ్గా 30 ఏళ్ల క్రితం ఇలానే..)

ఇక సుశాంత్‌ బలవనర్మణం నేపథ్యంలో అనేక కీలక మలుపుల అనంతరం ఎన్‌సీబీ రియా సోదరుడు షోవిక్‌ చక్రవర్తితో పాటు డ్రగ్‌ డీలర్లు జైద్‌ విలాత్రా, బాసిత్‌ పరిహార్‌ తదితరులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. విచారణలో భాగంగా షోవిక్‌ వెల్లడించిన వివరాల ఆధారంగా రియాతో పాటు సుశాంత్‌ హౌజ్‌ మేనేజర్‌ శామ్యూల్‌ మిరాండాను కూడా అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో వీరు పెట్టుకున్న బెయిలు పిటిషన్‌ను ముంబై సెషన్స్‌ కోర్టు తిరస్కరించడంతో సెప్టెంబరు 22 వరకు ఎన్‌సీబీ అదుపులో ఉండనున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు