Rhea Kapoor: చిరకాల ప్రియుడితో సోనమ్‌ కపూర్‌ సోదరి పెళ్లి!

14 Aug, 2021 11:28 IST|Sakshi

బాలీవుడ్‌ నటుడు అనిల్‌ కపూర్‌, సునీతా కపూర్‌ల చిన్న కుమార్తె రియా కపూర్‌ పెళ్లి పీటలెక్కనుంది. తన చిరకాల ప్రియుడు కరణ్‌ బూలానీని ఈరోజు(ఆగష్టు14) జూహూలోని కపూర్‌ బంగ్లాలో వివాహమాడనున్నారు. ఈ వేడుకను ప్రైవేట్‌గా ఉంటుందని బాలీవుడ్‌ వర్గాలు భావిస్తున్నాయి. కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నట్లు సమాచారం.

పెళ్లి వేడుకలు రెండు నుంచి మూడు రోజల వరకు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. కానీ ఇప్పటి వరకు కపూర్‌ ఫ్యామిలీ రియా పెళ్లి వార్తలను ధృవీకరించలేదు. అయితే కరణ్‌ కరణ్‌ జుహూలోని అనిల్‌ కపూర్‌ ఇంటి వద్ద సందడి చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీంతో శనివారమే రియా, కరణ్‌లు మూడుమూళ్ల బంధంతో ఏకం కానున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

కాగా నిర్మాత అయిన రియా కపూర్‌, కరణ్‌తో గత 13 ఏళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. కరణ్‌ బూలానీ కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఎన్నో యాడ్స్‌ను నిర్మించి మంచి పేరును సాధించారు. అంతేగాక రియా కపూర్ నిర్మించిన ఐషా, వేక్ అప్ సిడ్ వంటి చిత్రాలకు సహాయ నిర్మాతగా పనిచేశాడు.

మరోవైపు ఏడాదిపాటటు లండన్‌లో ఉన్న సోనమ్ కపూర్ గత నెల జూలైలో ముంబైకి తిరిగొచ్చింది. ఆమె భర్త ఆనంద్ అహుజా కూడా ప్రస్తుతం ముంబైలో ఉన్నారు. ఇదిలా ఉండగా.. బాలీవుడ్‌ ప్రొడ్యూసర్‌గా బిజీగా ఉన్న రియా కపూర్‌, టీవీ సిరీస్‌ డైరెక్టర్‌ కరణ్‌ బూలానీలో ప్రేమలో ఉన్నారంటూ గత కొన్నిరోజులగా రూమర్లు వినిపిస్తున్నాయి. కపూర్‌ కుటుంబానికి సంబంధించిన ప్రతీ వేడుకలోనూ కరణ్‌ భాగం కావడం వీటికి మరింత బలాన్ని ఇచ్చింది.

ఇందుకుతోడు కొన్నిరోజుల క్రితం సోనమ్‌ తల్లి సునీత కపూర్‌.. భర్త, కూతుళ్లు, కొడుకు, పెద్దల్లుడు ఆనంద్‌ అహుజాలతో పాటు కరణ్‌ ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. ‘నాకు ఇష్టమైన వ్యక్తులతో మరో కొత్త ప్రేమకథను సెలబ్రేట్‌ చేసుకుంటున్నా’  అంటూ క్యాప్షన్‌ జతచేసి హింట్‌ ఇచ్చారు. అయితే సోనమ్‌ ఇంటర్వ్యూతో ఈ వార్త కన్ఫామ్‌ అయ్యింది.

A post shared by SimplyAmina 🌴 (@simplyaminaofficial)

మరిన్ని వార్తలు