నటిపై ఆరోపణలు; రూ. కోటి పరువు నష్టం దావా

7 Oct, 2020 16:00 IST|Sakshi

ముంబై : బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ తనపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు మోపిన నటి పాయల్‌ ఘోష్‌పై  రూ.కోటి పది లక్షల పరువు నష్టం దావా వేశారు రిచా చద్ధా. 2013లో అనురాగ్‌ కశ్యప్‌‌‌ తనను లైంగికంగా వేధించారని పాయల్ ఆరోపించిన విషయం తెలిసిందే. తాను ఫోన్‌ చేస్తే చాలు ముగ్గురు హీరోయిన్లు రిచా చద్దా, మహీ గిల్‌, హ్యుమా ఖురేషీలు తన వద్దకు వస్తారంటూ కశ్యప్‌ ఆ సమయంలో చెప్పినట్లు’ పాయల్‌ పేర్కొన్నారు. అయితే తాను ఎటువంటి ప్రలోభాలకూ లొంగలేదని ఆమె వెల్లడించారు. చదవండి: లైంగిక ఆరోపణలు.. విచారణకు హాజరైన దర్శకుడు

ఈ ఆరోపణలపై మరోనటి రిచా చద్దా స్పందించి పాయల్‌కు లీగల్‌ నోటీసులు పంపించారు. పాయల్‌ చేసిన వ్యాఖ్యలు తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించేలా ఉన్నాయని బాంబే హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. నష్ట పరిహారంగా ఒక కోటి 10 లక్షల రూపాయలను డిమాండ్‌ చేశారు. ఈ పిటిషన్‌ను బుధవారం విచారించిన జస్టిస్ ఎకే మీనన్ ఏకసభ్య ధర్మాసనం పాయల్‌ చేసిన వ్యాఖ్యలను ఆమె ఉపసంహరించుకుంటే సరిపోతుందా అని రిచా తరపు న్యాయవాదిని అడిగారు. చదవండి: దర్శకుడిపై అత్యాచారం కేసు

దీనిపై స్పందించిన పాయల్.. కేవలం తను అనురాగ్‌ మాట్లాడిన వ్యాఖ్యలను మాత్రమే చెప్పినట్లు పేర్కొన్నారు. దీనిని తప్పుడు ఆరోపణగా పేర్కొంటూ.. ఈ కేసుతో తనకు ఏ సంబంధం లేదని తెలిపారు. అసలు తన పేరు తీసినందుకు అనురాగ్‌ కశ్యప్‌ను రిచా ప్రశ్నించాలని పేర్కొన్నారు. అనంతరం కేసు విచారణను వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. మరో వైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న అనురాగ్‌ కశ్యప్‌కు బాలీవుడ్‌ ప్రముఖుల నుంచి మద్దతు లభిస్తోంది. ఆయన మాజీ భార్యలు కల్కి కొచ్లిన్‌, ఆర్తి బజాజ్‌లు సైతం కశ్యప్‌కు బాసటగా నిలిచారు కాగా తనపై లేనిపోని ఆరోపణలు చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు.
 

మరిన్ని వార్తలు