చట్టపరమైన చర్యలు తీసుకుంటా: నటి

21 Sep, 2020 14:38 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ ప్రముఖ దర్శక-నిర్మాత అనురాగ్‌ కశ్యప్‌పై లైంగిక ఆరోపణలలో తన పేరును వాడటాన్ని నటి రిచా చద్దా తీవ్రంగా ఖండించారు. ఈ వివాదంలో తన పేరు వాడిన మూడవ వ్యక్తిపై త్వరలోనే చట్టపరమైన తీసుకుంటున్నట్లు ఆమె తరపు న్యాయవాది సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌పై నటి పాయల్‌ ఘోష్ శనివారం లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ‌రిచా చద్దాతో పాటు మరో ఇద్దరు నటుల పేర్లను కూడా పాయల్‌ వాడారు. తన పేరు అవమానకర రీతిలో వాడారంటూ రిచా ఆగ్రహం వ్యక్త చేశారు. వారిపై న్యాయపరమైన పోరాటానికి తాను సిద్దంగా ఉన్నట్లు రిచా ప్రకటించారు. (చదవండి: అనురాగ్‌ నన్ను ఇబ్బందిపెట్టాడు)

‘అనురాగ్‌పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో మూడవ వ్యక్తి అనవసరంగా నా క్లైయింట్‌ రిచా చద్దా పేరు తీసుకువచ్చారు. ఆమె అన్యాయానికి గురైన మహిళలకు న్యాయంగా జరగాలని కోరుకునే వ్యక్తి. అలాంటి వ్యక్తి పేరును అవమానకర రీతిలో వాడారు’ అని చద్దా తరపు ఆయన అన్నారు.  ‘‘నిరాధారమైన ఆరోపణల వివాదాల్లో మూడవ వ్యక్తి తనను తీసుకురావడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆధారాలు లేని తప్పుడు ఆరోపణలు చేయడమే కాకుండా ఇతర మహిళలను అనవసరంగా వివాదంలో లేవనెత్తి సమాజంలో వారి ఆత్మగౌరవాన్ని కించపరిచారు. ఓ మహిళ తన స్వేచ్చా పోరాటంలో మరో మహిళ వ్యక్తిత్వాన్ని దేబ్బతీసే హక్కు లేదు. దీనిని తీవ్రంగా ఖండించడమే కాకుండ న్యాయ పోరాటానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాం. త్వరలోనే చట్టపరమైన చర్యలు ప్రారంభిస్తాం’’ అని పేర్కొన్నారు. (చదవండి: మీ టూ: అనురాగ్‌కు మాజీ భార్య మద్దతు)

💪🏼

A post shared by Richa Chadha (@therichachadha) on

సినిమా చాన్స్‌లు కావాలంటే ప్రతి నటి తనతో చాలా సన్నిహితంగా ఉంటుందని దర్శకుడు అనురాగ్‌ తనతో చెబుతూ లైంగిక దుష్పవర్తనకు పాల్పడినట్లు నటి పాయల్‌ ఓ ఇంటర్యూలో ఆరోపించింది. దీనికి తాను అనురాగ్‌తో ‘మీరు రిచా చద్దాకు అవకాశం ఇచ్చారు. మహీ గిల్‌, హుమా ఖురేషిలకు సినిమా ఛాన్స్‌లు ఇచ్చారు. వారు చాలా నార్మల్‌గా కనిపించే అమ్మాయిలే అయినప్పటికీ మీరు వారికి మీ సినిమాల్లో అవకాశం ఇచ్చారు. అసలు దర్శకులేవరు అలాంటి అమ్మాయిలకు అవకాశం ఇవ్వరూ కానీ మీరు గొప్ప పని చేశారు అని చెప్పి మానసికంగా నేను దీనికి సిద్దంగా లేను’ అని కశ్యప్‌తో చెప్పానన్నారు. అనురాగ్ కశ్యప్ 2012లో తన క్రైమ్ డ్రామా ‘గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్’లో రిచా చద్దా.. నాగ్మా ఖటూన్ పాత్రలో నటించారు. హుమా ఖురేషి కూడా అదే ప్రాజెక్ట్ ఓ పాత్రలో కనిపిచారు. 2009లో కశ్యప్‌ దర్శకత్వం వహించిన ‘దేవ్ డి’లో మహీ గిల్ నటించారు. (చదవండి: నేనెప్పుడూ అలా ప్ర‌వ‌ర్తించ‌లేదు: అనురాగ్‌)

మరిన్ని వార్తలు