తల్లి కాబోతున్న 'మిర్చి' హీరోయిన్‌

28 Feb, 2021 15:12 IST|Sakshi

'లీడర్‌' సినిమాతో వెండితెరకు పరిచయమైంది రిచా గంగోపాధ్యాయ. ఆ తర్వాత 'నాగవల్లి' సినిమాలో కనిపించి తన నటనతో ఆకట్టుకుంది. 'మిరపకాయ్‌' సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన రిచాకు తమిళ, బెంగాలీ నుంచి కూడా ఆఫర్లు వచ్చాయి. అదే సమయంలో 'ఆరడుగుల అందగాడు నన్ను బాబీగర్ల్‌ అన్నాడు..' అంటూ ప్రభాస్‌తో మిర్చిలో సెకండ్‌ హీరోయిన్‌గా నటించి, అతడితో ఆడిపాడింది. ఈ సినిమాతో కుర్రకారుల మనసు దోచిన బేబీ డాల్‌గా ఉన్న ఆమె 2013లో సినిమాలకు స్వస్తి పలికింది.

2019 డిసెంబర్‌లో అమెరికాలోని తన చిన్ననాటి స్నేహితుడు, ప్రేమికుడు జో లాంగేల్లాను పెళ్లాడింది. తాజాగా ఆమె తను గర్భం దాల్చిన విషయాన్ని అభిమానులతో పంచుకుంది. కొంతకాలంగా ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాం. కానీ ఇప్పుడు మీ అందరితో దాన్ని షేర్‌ చేసుకుంటున్నందుకు జో, నేను చాలా సంతోషంగా ఉన్నాం. ఈ జూన్‌లో బేబీ లాంగేల్లా రాబోతోంది. ఆ క్షణం కోసం మేము ఆతృతగా ఎదురు చూస్తున్నాం అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. త్వరలోనే మాతృత్వపు మాధుర్యాన్ని చవిచూడనున్న రిచాకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

A post shared by Richa Langella (@richalangella)

చదవండి: సన్నీడియోల్‌ మొదట ప్రేమించింది ఎవరినంటే?

సన్నీలియోన్‌ భర్తకు షాకిచ్చిన డ్రైవర్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు