పండంటి బిడ్డకు జన్మనిచ్చిన రిచా గంగోపాధ్యాయ, ఫొటోలు వైరల్‌

5 Jun, 2021 12:48 IST|Sakshi

నటి రిచా గంగోపాధ్యాయ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. మే 27న తనకు మగబిడ్డ పుట్టాడనే శుభవార్తను సోషల్‌ మీడియా వేదికగా ఆలస్యంగా వెల్లడించారు. బాబుకు ‘లుకా షాన్‌’ అనే పేరు పెట్టినట్లు ఆమె తెలిపారు. తన ముద్దుల తనయుడి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ ‘మా చిరు సంతోషం.. లుకా షాన్‌. మే 27న జన్మించాడు. చిన్నారి రాకతో మేమంతా ఆనందంలో మునిగి తేలుతున్నాం. లుకా ఆరోగ్యంగా, ఆనందంగా, అచ్చం తన తండ్రి పోలికలతో ఉన్నాడు. లుకా.. నీ నువ్వు మా జీవితాల్లో చెప్పలేనంత ఆనందాన్ని నింపావు’ అంటు ఆమె రాసుకొచ్చారు.

కాగా రిచా తన చిన్ననాటి స్నేహితుడైన జో లాంగేల్లాను సీక్రెట్‌గా వివాహమాడిన సంగతి తెలిసిందే. అయితే తను పెళ్లి చేసుకున్న విషయాన్ని కొద్ది రోజుల తర్వాత ప్రకటించి అందరికి షాక్‌ ఇచ్చారు. అలాగే తన తన ప్రెగ్నెన్సీ మ్యాటర్‌ను కూడా రహస్యంగా ఉంచిన ఆమె కొద్ది రోజుల కిందట బేబీ బంప్ ఫొటోలను షేర్‌ చేసి అసలు విషయం బయటపెట్టారు. ఫిబ్ర‌వరిలో తాను త‌ల్లి కాబోతున్న‌ట్టు తెలియ‌జేసిన రిచా.. గత నెల 27న పండంటి మ‌గ బిడ్డ పుట్టాడంటు ఈ సారి కూడా కాస్త ఆల‌స్యంగా తెలియ‌జేస్తున్నామ‌ని పేర్కొన్నారు.

త‌మ‌కు పుట్టిన చిన్నారి ఫొటోల‌ను కూడా రిచా త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ‘లీడర్‌’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు రిచా. మొదటి సినిమాతో ఆకట్టుకున్న ఆమె ‘నాగవల్లి’, ‘మిరపకాయ్‌’, ‘సారొచ్చారు’ వంటి చిత్రాల్లో నటించారు. ‘మిర్చి’ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. చివరగా 2013లో వచ్చిన ‘భాయ్‌’ సినిమా కనిపించిన రిచా ఆ తర్వా ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లారు. అక్కడ బిజినెస్‌ స్కూల్‌లో జోను ప్రేమించారు. పెద్దల అంగీకారంతో ఈ జంట వివాహబంధంతో ఒక్కటయ్యారు. 

A post shared by Richa Langella (@richalangella)

చదవండి: 
Adipurush: ప్రభాస్‌ షాకింగ్‌ రెమ్యూనరేషన్‌!

లైవ్‌లో నీ వయసు అదేనా అని అడిగిన నెటిజన్‌, హీరోయిన్‌ కౌంటర్‌ 

మరిన్ని వార్తలు