షూటింగ్‌లో నిజంగా పేలిన బాంబు.. హీరోకు గాయాలు

2 Mar, 2021 16:59 IST|Sakshi

అప్పట్లో సినిమాల్లో యాక్షన్‌ సన్నివేశాలకు అధికంగా డూప్‌లనే వినియోగించేవారు. ఫేమ్‌ను దృష్టిలో పెట్టుకొని హీరోలు కష్టపడకుండా డూప్‌లతనే పని కానిచ్చేవారు.  కానీ ఈమద్య  ట్రెండ్‌ మారడంతో అన్ని సన్నివేశాలు డూప్‌లు లేకుండా సొంతంగా సాహసం చేస్తున్నారు. రియాల్టీ కోసం యాక్షన్‌ సన్నివేశాలను కూడా అవలీలగా చేసేస్తున్నారు. అయితే ఇలాంటి రిస్క్‌ తీసుకునే ముందు తప్పగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమాత్రం బాధ్యతారహితంగా ఉన్నా పెద్ద ప్రమాదం చోటుచేసుకునే అవకాశం ఉంటుంది. తాజాగా అలాంటి ఘటనే కన్నడ సినీ పరిశ్రమలో చోటుచేసుకుంది.  కన్నడ హీరో రిషబ్‌ శెట్టి కూడా ఇలాగే షూటింగ్‌లో గాయ పడగా.. ఈ విషయం కాస్త ఆలస్యగా వెలుగులోకి వచ్చింది. రిషబ్‌ శెట్టి హీరోగా నటిస్తున్న చిత్రం ‘హీరో’. గణవి లక్ష్మణ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల ఈ మూవీ ట్రైలర్‌ విడుదలవ్వగా.. ఆడియోన్స్‌ నుంచి మంచి స్పందన లభించింది. ఈ చిత్రం మార్చి 5న థియేటర్లలో విడుదల కానుంది.

అయితే హాసన్‌ జిల్లాలోని బేలుర్‌లో షూటింగ్‌ చేస్తున్న క్రమంలో ఓ యాక్షన్‌ సన్నివేశంలో భాగంగా రిషబ్‌, గణవిపైకి పెట్రోల్‌ బాంబ్‌ను విసరాల్సి ఉంటుంది. ఈ సమయంలో వీరు పక్కకు దూరంగా వెళ్లాలి. కానీ వీరిద్దరు కాస్త ఆలస్యంగా మూవ్‌ కావడంతో అప్పటికే బాంబు పేలి మంటల చెలరేగడంతో రిషబ్‌కు స్పల్ప గాయాలయ్యాయి. దీంతో షూటింగ్‌ను నిలిపివేసి హీరోను ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా కన్నడ పరిశ్రమలో రిషబ్‌ శెట్టికి బాగానే ఫాలోయింగ్‌ ఉంది. తుగ్లక్‌ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రిషబ్‌ బెల్‌ బటమ్‌ చిత్రంలో మంచి గుర్తింపు సాధించారు.   అప్పటి నుంచి వరుస సినిమా అవకాశాలు తలుపు తట్టడంతో బిజీగా మారాడు. 

చదవండి: 

వకీల్‌సాబ్‌ అప్‌డేట్‌.. రెండో పాటకు రేపే ముహూర్తం!

తెలంగాణ యాసలో అలరించనున్న ‘బేబమ్మ’

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు