Rishab Shetty With AB Devilliers: కాంతార హీరోతో సౌతాఫ్రికా లెజెండ్..సోషల్ మీడియాలో వైరల్

4 Nov, 2022 19:59 IST|Sakshi

రిషబ్‌శెట్టి దర్శకుడిగా, హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ 'కాంతారా'. ఈ చిత్రం అన్ని భాషల్లోనూ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ మూవీ సక్సెస్‌తో రిషబ్ ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. తాజాగా రిషబ్ శెట్టిని దక్షిణాఫ్రికా లెజెండ్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ బెంగళూరులో కలుసుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరలవుతోంది. 

(చదవండి: కాంతార మరో రికార్డ్.. కార్తికేయ-2ను అధిగమించి..!)

రిషబ్ శెట్టి తన ఇన్‌స్టాలో ఓ వీడియోను పంచుకున్నారు. అందులో దక్షిణాఫ్రికా లెజెండ్ డివిలియర్స్, రిషబ్ కలిసి కాంతార అంటూ గట్టి అరుస్తూ కనిపించారు. రిషబ్  ఇన్‌స్టాలో రాస్తూ..' ఇది ఒక మ్యాచ్! ఈ రోజు నిజమైన 360ని కలుసుకున్నాను. మా బెంగళూరికి మళ్లీ తిరిగి వచ్చాడు..' అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. 

వీరిద్దరి సమావేశంపై అభిమానులు తెగ కామెంట్లు చేస్తున్నారు. ఓ అభిమాని స్పందిస్తూ 'టూ స్టార్స్' అంటూ వ్యాఖ్యానించారు. మరో అభిమాని 'ఇద్దరు లెజెండ్స్ వావ్‌' అని రాసుకొచ్చారు. కాంతార చిత్రానికి రిషబ్ శెట్టి  దర్శకత్వం వహించి, హీరోగా నటించారు. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్, చలువే గౌడ నిర్మించిన ఈ చిత్రంలో సప్తమి గౌడ, కిషోర్ కుమార్ జి కూడా కీలక పాత్రల్లో నటించారు.

A post shared by Rishab Shetty (@rishabshettyofficial)

మరిన్ని వార్తలు