Rishab Shetty: తెలుగులో నటించిన కాంతార హీరో రిషబ్‌ శెట్టి, ఏ సినిమానో తెలుసా?

3 Nov, 2022 16:42 IST|Sakshi

చిన్న సినిమాగా వచ్చి పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన లేటెస్ట్‌ మూవీ కాంతార. తొలుత కన్నడ ప్రాంతీయ సినిమాగా విడుదలైన ఈ సినిమా ఇప్పుడు తెలుగు, హిందీ, తమిళంలో సంచలన విజయం సాధించింది. అన్ని భాషల్లో ఈ సినిమాకు బ్రహ్మర్థం పడుతున్నారు. దీంతో ఈ మూవీ ఇండియన్‌ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇక చిత్రంలో లీడ్‌ రోల్‌ పోషించిన రిషబ్‌ శెట్టి ఒక్కసారిగా పాన్‌ ఇండియా స్థాయిలో క్రేజ్‌ సంపాదించుకున్నాడు. అయితే ఈ మూవీ ముందు వరకు అసలు రిషబ్‌ శెట్టి అంటే ఎవరో తెలియదు.

చదవండి: అరుదైన వ్యాధితో బాధపడుతున్న ‘జాతిరత్నాలు’ డైరెక్టర్‌

కానీ ఇప్పుడు ఈ పేరు వినగానే వెంటనే కాంతార హీరో, దర్శకుడని చెప్పేంతగా గుర్తింపు పొందాడు. ఇదిలా ఉంటే కాంతారకు ముందు రిషబ్‌ తెలుగులో నేరుగా ఓ సినిమా చేసిన విషయం మీకు తెలుసా? అది కూడా ఎలాంటి పారితోషికం లేకుండా? ఏంటి షాక్‌ అవుతున్నారా? అవును ఈ మూవీకి ముందు గతేడాది రిషబ్‌ శెట్టి తెలుగులో ఓ సినిమా చేశాడు. కానీ అందులో కనిపించింది ఓ రెండు, మూడు నిమిషాలు మాత్రమే. ఇంతకి ఈ సినిమా ఎంటంటే ఈ ఏడాది వచ్చిన ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’. ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస్‌ ఆత్రేయ’ ఫేం స్వరూప్‌ దర్శకత్వంలో తాప్సీ కీలక పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆయన అతిథి పాత్రలో కనిపించాడు. 

చదవండి: హన్సిక కాబోయే భర్త ఎవరు, ఏం చేస్తుంటాడో తెలుసా?

మూవీలో కీలక మలుపు తెచ్చే ఖలీల్‌ అనే దొంగ పాత్రలో కనిపించారు. అయితే అప్పటికి ఆయనకు ఈ స్థాయిలో గుర్తింపు లేకపోవడంతో రిషబ్‌ శెట్టిన ఎవరు గుర్తించలేదు. ఈ మూవీ డైరెక్టర్‌ స్వరూప్‌, రిషబ్‌కు మంచి స్నేహితుడట. ఆ స్నేహంతోనే ఇందులో ఖలీల్‌ పాత్ర చేయమని అడగ్గా రిషబ్‌ వెంటనే ఒకే చెప్పాడట. అంతేకాదు ఈ సినిమాకు ఆయన ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని సమాచారం. ఇక సినిమాలో ముగ్గురు పిల్లలు ముంబై వెళ్తున్నాము అనుకుని పొరపాటున బెంగళూరు వెళ్తారు. ఇక అక్కడ వాళ్లు ఎదుర్కొన్న సమస్యలు, వాటిని ఎలా అధికమించారు అనేదే ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ కథ. 

మరిన్ని వార్తలు