Rishab Shetty : ఎన్టీఆర్‌తో సినిమా చేయనున్న 'కాంతార' డైరెక్టర్‌?

8 Nov, 2022 14:39 IST|Sakshi

కన్నడ హీరో రిషబ్‌శెట్టి దర్శకుడిగా, హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ 'కాంతారా'. ఈ చిత్రం అన్ని భాషల్లోనూ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. చిన్న సినిమాగా విడుదలై పాన్‌ ఇండియా స్థాయిలో సత్తా చాటుతోంది. విడుదలైన అన్ని భాషల్లో కాంతార కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

ఇక ఈ చిత్రంలో లీడ్‌ రోల్‌ పోషించిన రిషబ్‌ శెట్టి ఒక్కసారిగా పాన్‌ ఇండియా స్థాయిలో క్రేజ్‌ సంపాదించుకున్నాడు.ఈ చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్‌ రిషబ్‌ శెట్టిని విమర్శకులు సహా సినీ ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. ఇటీవలె జూ.ఎన్టీఆర్‌ కూడా సినిమాపై ప్రశంసలు కురిపించాడు.

ఈ క్రమంలో త్వరలోనే  రిషబ్‌ శెట్టి దర్శకత్వంలో ఎన్టీఆర్‌ నటించనున్నారనే ప్రచారం జరిగింది. తాజాగా ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని రిషబ్‌ శెట్టి తెలిపారు. ఎన్టీఆర్‌తో సినిమా చేయాలని ఎవరికి ఉండదు? నాకు కూడా చేయాలని ఉంది.. కానీ ఇప్పుడు కాదు. ఆయనకి తగిన స్క్రిప్ట్‌ దొరికితే కశ్చితంగా కలుస్తానంటూ రూమర్స్‌కి చెక్‌ పెట్టారు. 


 

మరిన్ని వార్తలు