వ్యాక్సిన్‌ వేసుకున్నవాళ్లకే షూటింగ్‌లోకి అనుమతి

22 May, 2021 10:16 IST|Sakshi

చెన్నై: లాక్‌డౌన్‌ ముగిసి షూటింగులు ప్రారంభమైనా వ్యాక్సిన్‌ వేసుకున్న వారికే  అనుమతి ఉంటుందని దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ) అధ్యక్షుడు వ్యాక్సిన్‌ వేసుకున్న వారికే  అనుమతి ఉంటుందని. రాష్ట్రంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న  విషయం తెలిసిందే. దాని బారిన పడి వేలాదిమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కరోనాను కట్టడి చేయాలంటే వ్యాక్సిన్‌ వేయించుకోవడం ఒక్కటే మార్గమని వైద్యులు చెబుతున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఈ నెల 31వ తేదీ వరకు సినిమా, టీవీ సీరియళ్ల షూటింగ్‌లను నిలిపి వేస్తున్నట్లు ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్‌.కె.సెల్వమణి ప్రకటించారు. ఆయన తాజాగా మరో ప్రకటన విడుదల చేశారు. లాక్‌డౌన్‌ తర్వాత షూటింగులు ప్రారంభమైనప్పుడు అందులో పాల్గొనే వారు తప్పనిసరిగా వ్యాక్సిన్‌ వేయించుకుని ఉండాలని పేర్కొన్నారు. వారికే షూటింగ్‌లో పాల్గొనడానికి అనుమతి ఉంటుందని తెలిపారు. అందుకు తగిన ధ్రువీకరణ పత్రాన్ని అందజేయాలని తెలిపారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు