Batman Movie: అత్యధిక నిడివి ఉన్న చిత్రం ఇదేనట !.. భారీగా అంచనాలు

21 Jan, 2022 19:01 IST|Sakshi

Robert Pattinson Batman Movie Runs Nearly 3 Hours: ప్రపంచవ్యాప్తంగా బ్యాట్‌మ్యాన్‌ సినిమాలకు ఉన్న క్రేజ్‌ మాములుగా ఉండదు. ఈ సిరీస్‌లో వచ్చిన చిత్రాలు ఆడియెన్స్‌ను ఎంతగానో అలరించాయి. ఈ ఫ్రాంచైజీ నుంచి సినిమా వస్తుందంటే చాలు అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తారు. హాలీవుడ్‌లో సూపర్‌ హీరోస్‌ మూవీస్‌ సహజమే. మిగతా సూపర్‌ హీరోస్‌కు పవర్స్‌ అనుకోకుండా జరిగే పలు సంఘటనల ద్వారా వస్తాయి. కానీ బ్యాట్‌ మ్యాన్‌ మాత్రం తనకు తాను సొంతగా సూపర్‌ హీరోల మారతాడు. అది ఎలానో 2005లో వచ్చిన 'బ్యాట్‌మ్యాన్‌: బిగిన్స్‌' చిత్రం చూస్తే తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల బ్యాట్‌మ్యాన్‌ సిరీస్‌ కొత్త చిత్రం 'ది బ్యాట్‌మ్యాన్‌: ది బ్యాట్‌ అండ్ ది క్యాట్‌' ట్రైలర్‌ విడుదలైంది. 

(చదవండి: 'స్క్విడ్‌ గేమ్‌' మళ్లీ రానుంది.. ఈసారి ఎలాంటి గేమ్‌ ?)

విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ ట్రైలర్‌ వైరల్‌గా మారింది. ఇందులో సూపర్‌  హీరోగా 'ట్విలైట్‌' మూవీ ఫేమ్‌ రాబర్ట్‌ ప్యాటిన్సన్‌ నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా గురించి ఒక కొత్త విషయం చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా నిడివి ఈ సిరీస్‌లోని మిగతా చిత్రాలకంటే ఎక్కువగా ఉండనుందట. ఈ సిరీస్‌లో వచ్చిన 'ది బ్యాట్‌మ్యాన్‌: బిగిన్స్‌' రన్‌టైం 2 గంటల 20 నిమిషాలు, 'ది డార్క్‌నైట్‌' నిడివి 2 గంటల 32 నిమిషాలు ఉంది. వీటి తర్వాత 2012లో వచ్చిన 'ది డార్క్‌నైట్‌ రైజెస్‌' మూవీ రన్‌టైం 2 గంటల 45 నిమిషాలు ఉంది. కాగా ప్రస్తుతం రానున్న 'ది బ్యాట్‌ అండ్ ది క్యాట్‌' చిత్ర నిడివి సుమారు 2 గంటల 55 నిమిషాలు ఉండనుందట. అంటే దాదాపు 3 గంటలు. 

(చదవండి: నా కొడుకు హృతిక్‌లా ఉండాలి.. కానీ: స్టార్‌ హీరోయిన్‌)

హాలీవుడ్‌లో విడుదలైన సూపర్‌ హీరో చిత్రాలు 'జాక్‌ స్నైడర్‌ జస్టీస్‌ లీగ్' రన్‌టైం 4 గంటల 2 నిమిషాలు, 'అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌' నిడివి 3 గంటల 1 నిమిషం తర్వాత అతి పెద్ద రన్‌టైం ఉన్న సినిమా ఇదేనని సమాచారం. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికితోడు విడుదలైన రెండు ట్రైలర్స్‌కు కూడా మంచి ఆదరణ లభించింది. 

మరిన్ని వార్తలు