బిగ్‌బాస్‌ : అభిజిత్‌కి రోహిత్‌ శర్మ ఊహించని గిఫ్ట్‌

15 Jan, 2021 10:59 IST|Sakshi

బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ విజేతగా మిస్టర్‌ కూల్‌ అభిజిత్‌ ఊహించని వ్యక్తి నుంచి  సర్‌ప్రైజ్  గిఫ్ట్‌ అందుకున్నాడు. టీమిండియా వైస్ కెప్టెన్, హిట్‌మ్యాన్‌ రోహిత్ శర్మ ఫోన్‌ చేసి మాట్లాడటమే కాకుండా.. ప్రేమతో తన జెర్సీని అతడికి గిఫ్ట్‌గా పంపించాడు. ఈ విషయాన్ని అభిజీతే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. తన గురించి రోహిత్ శర్మకు చెప్పిన తెలుగు క్రికెటర్ హనుమ విహారికి ధన్యవాదాలు తెలిపాడు. 

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న రోహిత్‌ శర్మ, హనుమ విహారికి మధ్య జరిగిన సంభాషణలో బిగ్‌బాస్‌ షో గురించి చర్చకు వచ్చిందట. ఈ సందర్భంగా బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ విన్నర్‌ అభిజిత్‌ గురించి రోహిత్‌కు చెప్పాడట హనుమ విహారి. అంతేకాకుండా అతను తనకు పెద్ద ఫ్యాన్‌ అన్న విషయం కూడా చెప్పాడట. దీంతో రోహిత్‌ అభిజిత్‌కు ఫోన్‌ చేసి విజేతగా నిలిచినందుకు కంగ్రాట్స్ తెలిపాడట. అలాగే అతన్ని అభినందిస్తూ తన జెర్సీని గిఫ్ట్ ఇచ్చాడట. రోహిత్ శర్మ జెర్సీ నెంబర్ 45. దానిపై విత్ లవ్, బెస్ట్ విషెస్... రోహిత్ శర్మ అంటూ సంతకం చేసి మరీ ఇచ్చాడని అభిజిత్ ట్వీటర్‌లో పేర్కొన్నాడు.

అంతేకాకుండా రోహిత్ శర్మ తన ఫేవరెట్ క్రికెటర్ అని, అతని నుంచి గిఫ్ట్ రావడం సంతోషంగా ఉందని అభిజిత్ క్యాప్షన్‌గా రాసుకొచ్చాడు. ఇక రోహిత్ శర్మ తల్లి పూర్ణిమా శర్మది విశాఖపట్నం అన్న విషయం తెలిసిందే. రోహిత్‌ మహారాష్ట్రలోనే పుట్టిపెరిగినప్పటికీ.. తెలుగు మూలాల కారణంగా అతడికి తెలుగు అర్థం అవుతుంది. అంతే కాదు గతంలో అతడు డెక్కర్ ఛార్జర్స్ తరఫున ఐపీఎల్‌లో కూడా ఆడాడు.

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు