సుస్మితతో పెళ్లి.. ప్రియుడి కామెంట్‌

6 Feb, 2021 15:13 IST|Sakshi

మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ నటి సుస్మిత సేన్ సహజీవనం వార్తలు ఇటీవల కాలంలో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ప్రియుడు, డిజైనర్ రోహ్మాన్‌‌ షాల్‌తో కొన్ని నెలలుగా లివింగ్ రిలేషన్‌షిప్‌‌ను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు వారు దిగిన ఫోటోలను సోషల్‌ మీడియాలో తమ అభిమానుల కోసం షేర్‌ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఇటీవల రోహన్‌ ఓ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సుస్మిత పరిచయం, పెళ్లి ఆలోచన గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. కశ్మీర్‌ మూలాలున్న రోహ్మాన్‌ పుట్టి పెరిగిందంతా నైనిటాల్‌లోనని పేర్కొన్నాడు. డెహ్రాడూన్‌లో ఇంజనీరింగ్‌ తరువాత మోడలింగ్‌లో అడుగుపెట్టినట్లు తెలిపాడు. అయిదు, ఆరు సంవత్సరాల తర్వాత ముంబై వచ్చానని, అనంతరం రెండేళ్లకు సుస్మిత పరిచయం అయ్యిందని రోహ్మాన్‌ వెల్లడించాడు.

సుస్మితతో పరిచయం ఏర్పడ్డాక నా జీవితంలో ప్రతిదీ మారిపోయింది. బయటి వ్యక్తులకు ఓ స్టార్‌ జీవితం గురించి నిర్ధిష్ట అవగాహన ఉంటుంది. కానీ ఒకసారి మనం వారితో కలిసుంటే దాని వెనుక ఉన్న కష్టం తెలుస్తుంది. సుషు కలిసాక నా వ్యక్తిగత జీవితం మారిపోయింది. ఆ తర్వాతే నేను జీవితాన్ని సీరియస్‌గా చూడటం, ఇతరులు గౌరవించడం మొదలు పెట్టాను. నేను మోడలింగ్ ప్రారంభించినప్పుడు ఒక స్టార్ అవ్వాలనుకున్నాను, కానీ వేర్వేరు ప్లాన్స్‌‌ ఉన్నాయి. ప్రస్తుతానికి నేను మోడలింగ్‌కు కట్టుబడి ఉండాలని అనుకుంటున్నాను, అది నాకు సంతోషాన్ని ఇస్తుంది. ఫేమస్‌ అవ్వాలనే ఆలోచన ఇప్పుడు నా జాబితాలలో లేదు.’ అని పేర్కొన్నాడు.
చదవండి: సుష్మితకు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన ప్రియుడు

అదే విధంగా సుస్మితతో పెళ్లి విషయం గురించి మాట్లాడుతూ.. ‘సుష్మిత, తన కుమార్తెలతో ఇప్పటికే నేను ఒక కుటుంబంగా ఏర్పడ్డాం. నేను ఆ పిల్లలకు తండ్రి లాంటివాడినని కొన్నిసార్లు అనుకుంటా.  మరి  కొన్నిసార్లు వాళ్లకు స్నేహితుడినని ఫీల్‌ అవుతాను. పిల్లలతో పోట్లాడుతాను. ఇలా అన్ని షేర్‌ చేసుకుంటాను కాబట్టి మేము కుటుంబంగా చేరి నార్మల్‌గానే జీవిస్తాం. దీన్నే నేను సంతోషిస్తాను. కాబట్టి మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని అడిగే ప్రశ్నలపే మేము మాట్లాడలేము. పెళ్లి జరిగినప్పుడు దాన్ని దాచము. అందరికీ చెబుతాం. ప్రస్తుతానికి మేము సుషు వెబ్ సిరీస్ విజయాన్ని ఆస్వాదిస్తున్నాం. దాని తరువాత ఆలోచిస్తాం. సుష్మితతో డేటింగ్‌ గురించి నేను మా తల్లిదండ్రులతో చెప్పలేదు. వాళ్లే తెలుసుకొని నాకు సపోర్ట్‌గా నిలిచారు. మా పెళ్లికి ఇప్పుడేం తొందర లేదు.’ అని స్పష్టం చేశాడు

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు