నాగశౌర్యతో జతకట్టనున్న ఆకాష్‌ పూరీ భామ!

7 Aug, 2020 17:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవల హీరో నాగశౌర్య నటించిన  ‘అశ్వథ్థామ’ విడుదలై సూపర్‌ హిట్‌ సాధించింది. ‘అశ్వథ్దామ’ హిట్‌తో జోరుమీదున్న నాగశౌర్య తెలుగులో వరస సినిమాలకు సంతకాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సుబ్రమణ్యపురం ఫేమ్‌ సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమాలో నాగశౌర్య సరసన మాస్‌ దర్శకుడు పూరిజగన్నాద్‌ తనయుడు ఆకాష్‌ పూరి ‘రోమాంటిక్‌’ భామ కేతిక శర్మ నటిస్తున్నట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే దర్శక-నిర్మాతలు ఆమెను సంప్రదించినట్లు కూడా తెలుస్తోంది. (చదవండి: నాగశౌర్య లుక్‌ అదుర్స్‌)

ఆకాష్‌ పూరితో నటించిన తన మొదటి సినిమా ‘రోమాంటిక్‌’  విడుదల కాకముందే మరో సినిమాలో నటించే అవకాశం కొట్టేసింది ఈ ముంబై భామ.  విలువిద్య నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో నాగశౌర్య సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించనున్నాడు. అయితే ఈ సినిమా టైటిల్‌ ఇంకా ఖరారు కాకుముందే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ఈ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌కు టాలీవుడ్‌‌ ప్రేక్షకుల నుంచి పాజిటీవ్‌ రెస్పాన్స్‌  వస్తోంది. 

మరిన్ని వార్తలు