వైజయంతీ మూవీస్‌తో శ్రీకాంత్‌ కొడుకు నెక్ట్స్‌ మూవీ.. త్వరలోనే ప్రారంభం

13 Mar, 2023 14:28 IST|Sakshi

‘నిర్మలా కాన్వెంట్‌’(2016), ‘పెళ్లిసందడి’ (2021) చిత్రాలతో ప్రేక్షకుల్లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హీరో రోషన్‌. ప్రస్తుతం తన తర్వాతి ప్రాజెక్ట్స్‌ కోసం కథలు వింటున్నారు. అయితే రోషన్‌ నెక్ట్స్‌ మూవీ వైజయంతీ మూవీస్‌లో చేస్తున్నాడు. అలాగే వేదాన్షన్‌ పిక్చర్స్‌ పతాకంపై కూడా మరో చిత్రంలో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ రెండు సినిమాలు ప్రారంభం కానున్నాయి. కాగా ఈ సినిమాల దర్శకులు, నటీనటులు, సాంకేతిక నిపుణల పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. తన తదుపరి సినిమాలు ప్రఖ్యాత నిర్మాణ సంస్థలలో రాబోతున్నాయి అని యువ నటుడు రోషన్ చాలా ఉత్సాహంగా వెల్లడించారు.

మరిన్ని వార్తలు