ఆకట్టుకుంటున్న ‘రౌడి బాయ్స్’‌ మోషన్‌ పోస్టర్‌

9 Apr, 2021 09:43 IST|Sakshi

హుషారు దర్శకుడు హర్ష కొనుగంటి రూపొందిస్తున్న తాజా చిత్రం ‘రౌడీ బాయ్స్’‌. ఈ మూవీతో ఆశిష్‌ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇందులో ఆశిష్‌కు జోడిగా హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్‌ దశ్‌లో ఉన్న ఈ మూవీ మెషన్‌ పోస్టర్‌ను తాజా చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ఇంజనీరింగ్‌, మేడికల్‌ కాలేజీ విద్యార్థుల మధ్య సాగే కథే ఈ రౌడీ బాయ్స్‌.

‘మా బాయ్స్‌తోటి ఎంట్రీ ఇస్తే అల్లకల్లోలం.. జర ముట్టుకుంటే అంటుకుంటాం అగ్గిపుల్లలం..’ అంటూ సాగే పాటతో విడుదలైన ఈ మోషన్‌ పోస్టర్‌ యువతను వీపరితంగా ఆకట్టుకుంటుంది. యాక్షన్‌, డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీని దిల్‌ రాజు ప్రొడక్షన్‌లో నిర్మిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. ​​కాగా జూన్‌ 25న ఈ మూవీ విడుదల కానుంది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు