RRR: ఆర్ఆర్ఆర్ మరో మైలురాయి.. ప్రతిష్ఠాత్మక అవార్డులకు నామినేట్

12 Dec, 2022 21:16 IST|Sakshi

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్. బాక్సాఫీస్ వద్ద  ఆ మూవీ  ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ అవార్డుల పరంపర ఇంకా కొనసాగిస్తోంది. తాజాగా ఆర్ఆర్ఆర్ మరో మైలురాయిని అందుకుంది. గోల్డెన్ గ్లోబ్స్- 2023 అవార్డ్స్‌లో ఆర్ఆర్ఆర్ ఉత్తమ నాన్ ఇంగ్లీష్ చిత్రం, ఉత్తమ పాటల కేటగిరీలో నామినేట్ అయింది. 

గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో రెండు విభాగాల్లో నామినేట్ చేయబడింది. నాటు నాటు సాంగ్ ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ కాగా.. ఉత్తమ నాన్-ఇంగ్లీష్ లాంగ్వేజ్ చిత్రం విభాగంలోనూ నామినేట్ అయింది. ఈ విషయాన్ని గోల్డెన్ గ్లోబ్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో వెల్లడించింది. ఈ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అలియా భట్, అజయ్ దేవగన్, శ్రియా శరణ్ ప్రధాన పాత్రల్లో నటించారు.

ఉత్తమ చిత్రం - నాన్-ఇంగ్లీష్ లాంగ్వేజ్ 
1.ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్
2.అర్జెంటీనా, 1985
3. క్లోజ్
4.డెసిషన్ టు లీవ్ 
5. ఆర్ఆర్ఆర్

ఉత్తమ ఒరిజినల్ సాంగ్ – మోషన్ పిక్చర్
1.కరోలినా, టేలర్ స్విఫ్ట్- (వేర్ ది క్రాడాడ్స్ సింగ్)
2.సియావో పాపా,  (గిల్లెర్మో డెల్ టోరోస్ పినోచియో)
3.హోల్డ్ మై హ్యాండ్( టాప్‌ గన్: మావెరిక్)
4.లిఫ్ట్ మీ అప్, (బ్లాక్ పాంథర్: వాకండ ఫరెవర్) 
5.నాటు నాటు (ఆర్ఆర్ఆర్)

మరిన్ని వార్తలు