ఆర్‌ఆర్‌ఆర్‌: క్లైమాక్స్‌లో భారీ ట్విస్ట్‌!

8 Mar, 2021 09:47 IST|Sakshi

హీరో చనిపోతే సినిమా చూడం అనే రోజులకు కాలం చెల్లింది. కథ బాగుంటే చాలు, నెగెటివ్‌ క్లైమాక్స్‌లను ఆదరించేందుకు సిద్ధమేనంటున్నారు తెలుగు ప్రేక్షకులు. ఈ క్రమంలో ప్రాణాలు విడిచిన హీరో కథ 'కలర్‌ ఫొటో'ను, నెగెటివ్‌ ఎండింగ్‌ ఉన్న 'ఉప్పెన' సినిమాను పెద్ద హిట్‌ చేయడమే ఇందుకు పెద్ద ఉదాహరణ. తాజాగా దర్శక ధీరుడు రాజమౌళి కూడా ట్రిపుల్‌ ఆర్‌ సినిమా క్లైమాక్స్‌ను విభిన్నంగా ప్లాన్‌ చేస్తున్నాడట. బ్రిటీష్‌ వాళ్లను ఎదిరించేందుకు కొమురం భీమ్‌ పాత్రలో నటిస్తున్న జూనియర్‌ ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్‌ చేతులు కలిపి ముందుకు సాగుతారన్న విషయం తెలిసిందే కదా!

వీరి పోరాట సన్నివేశాల్లో భారీ ట్విస్టు ఉండబోతుందట. కొమురం భీమ్‌, అల్లూరి సీతారామరాజుల్లో ఒకరికి కళ్లు పోతే, మరొకరికి కాళ్లు పోతాయన్న ప్రచారం జరుగుతోంది. అయితే వీళ్లిద్దరికీ అంగవైకల్యం చెందినప్పటికీ భీకరంగా పోరాడేందుకు ముందడుగు వేస్తారట. కాళ్లు కోల్పోయిన హీరోను రెండో హీరో తన భుజాలపై ఎత్తుకోగా ఈ ఇద్దరూ శత్రువులను చీల్చి చెండాడుతారని కథనాలు వెలువడుతున్నాయి. మరి ఇదే క్లైమాక్స్‌ ఆర్‌ఆర్‌ఆర్‌లో ఉండబోతుందా? లేదా ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా? అన్నది సస్పెన్స్‌గా మారింది.

కాగా డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌, హాలీవుడ్‌ సెలబ్రిటీలు భాగమైన విషయం తెలిసిందే. అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ, అలియా భట్‌, ఒలీవియా మోరిస్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్‌ 13న విడుదల కానుంది.

చదవండి: భారీ ధరకు అమ్ముడుపోయిన ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీ హక్కులు!

‘ఆర్‌ఆర్‌ఆర్’‌ క్లైమాక్స్‌ షూట్‌లో హాలీవుడ్‌ యాక్షన్‌ డైరెక్టర్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు