RRR: జపాన్‌లో ఆర్ఆర్ఆర్ దూకుడు.. రజనీకాంత్‌ రికార్డు బ్రేక్‌

12 Dec, 2022 21:31 IST|Sakshi

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్. బాక్సాఫీస్ వద్ద  ఆ మూవీ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. దేశవ్యాప్తంగా రికార్డ్ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం జపాన్‌లోనూ దూసుకెళ్తోంది. అక్కడి అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. అక్టోబర్ 21న జపాన్‌లో విడుదలైన 'ఆర్ఆర్ఆర్' రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమా రజినికాంత్ చిత్రం ముత్తు రికార్డును అధిగమించింది.

(ఇది చదవండి: జపాన్‌లోనూ 'ఆర్ఆర్ఆర్' జోరు.. త్రీ ఇడియట్స్ రికార్డు బ్రేక్)

24ఏళ్ల క్రితం జపాన్‌లో రిలీజ్‌ అయిన రజనీకాంత్‌ ‘ముత్తు’ సినిమా 400 మిలియన్‌ జపనీస్‌ యెన్‌లు వసూలు చేసింది. ఇప్పటివరకు జపాన్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్‌ సినిమాగా ముత్తు నిలిచింది. తాజాగా ఆర్‌ఆర్‌ఆర్‌ ఆ రికార్డును బద్దలు కొట్టింది. దాదాపు రెండు దశాబ్దాల నుంచి చెక్కు చెదరకుండా ఉన్న రికార్డును చెరిపేసింది. జపాన్‌లోని 44 నగరాల్లో 209 థియేటర్లలో విడుదలైన ఆర్‌ఆర్‌ఆర్‌ 400 మిలియన్‌ జపనీస్‌ యెన్‌ల‌(దాదాపు రూ.24కోట్లు) కంటే ఎక్కువ కలెక్షన్లు రాబట్టింది. దీంతో రజనీకాంత్‌ ముత్తు సినిమా రెండో స్థానంలోకి వెళ్లిపోయింది.   

>
మరిన్ని వార్తలు