RRR Update: ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి క్రేజీ అప్‌డేట్‌..

30 Oct, 2021 16:27 IST|Sakshi

RRR Latest Update: RRR First Glimpse Release Date: రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ హీరోలతో రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి 7న విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్‌డేట్‌ను అనౌన్స్‌ చేసింది చిత్ర బృందం. నవంబర్‌1న 11 గంటలకు  ఈ సినిమాకు ఆర్‌ఆర్‌ఆర్‌ ఫస్ట్‌గ్లింప్స్‌ను విడుదల చేస్తామని పేర్కొంది.  45 సెకన్ల నిడివితో ఆ వీడియో ఉంటుందని చిత్రబృందం తెలిపింది. దీంతో సెకండ్‌ గింప్ల్స్‌ కొసం ఫ్యాన్స్‌ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు అలరించనున్నాడు.

మరిన్ని వార్తలు