ఆర్‌ఆర్‌ఆర్‌: వారెవ్వా.. క్యా సీన్‌ హై!

29 Apr, 2021 00:38 IST|Sakshi

జూనియర్‌ ఎన్టీఆర్, పులి మధ్యలో వచ్చే ఓ సీన్‌ అదుర్స్‌. ప్రీ ఇంటర్‌వెల్‌లో రామ్‌చరణ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ సూపర్‌. సినిమాలోని అండర్‌ వాటర్‌ సన్నివేశం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే... ఇలా ‘రౌద్రం.. రణం.. రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్‌) సినిమాలోని సన్నివేశాల గురించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా మరో సీన్‌ గురించి చర్చ జరుగుతోంది. జైలులో జూనియర్‌ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల మధ్య వచ్చే ఆ సీన్‌ చాలా బాగుంటుందట. ఈ సీన్‌ ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేసేలా రాజమౌళి తెరకెక్కించారట.

అంతే కాదండోయ్‌.. సీన్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో కాలభైరవ వాయిస్‌లో వచ్చే పాట ప్రేక్షకులను కంటతడి పెట్టించేలా ఉంటుందని టాక్‌. ‘వారెవ్వా.. క్యా సీన్‌ హై’ (వారెవ్వా.. ఏం సీన్‌) అనేలా ఉంటుందట. ఈ చిత్రంలో స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీమ్‌ పాత్రలో జూనియర్‌ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్‌ కనిపిస్తారు. వాస్తవానికి కల్పన జోడించి రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబరు 13న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు