Alia Bhatt: ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం హైదరాబాద్‌కు ఆలియా

21 Jul, 2021 07:21 IST|Sakshi

RRR Movie: బాలీవుడ్‌ బ్యూటీ ఆలియా భట్‌ ‘రౌద్రం.. రణం.. రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్‌) సినిమా సెట్స్‌లోకి అడుగుపెట్టే సమయం ఆసన్నమైంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూట్‌లో జాయిన్‌ అయ్యేందుకు ముంబయ్‌ నుంచి హైదరాబాద్‌ బయలుదేరారు ఆలియా . నేటి (బుధవారం) నుంచి ఈ సినిమా షూట్‌లో  పాల్గొనే చాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో జూనియర్‌ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా నటిస్తున్నారు. ఎన్టీఆర్‌ సరసన ఒలీవియా మోరిస్, రామ్‌చరణ్‌కు జోడీగా ఆలియా భట్‌ కనిపిస్తారు. ఇందులో ఆలియా భట్‌ పాత్ర పేరు సీత. అక్టోబర్‌ 13న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.

మరిన్ని వార్తలు