రెండు గంటలకు ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రకటన

25 Jan, 2021 11:01 IST|Sakshi

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం రౌధ్రం రణం రుధిరం (ఆర్‌ఆర్‌ఆర్)‌. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. 'బాహుబలి' తర్వాత దేశమంతా దక్షిణాది సినిమాల వైపు ఆసక్తిగా చూస్తోంది. ఈ క్రమంలో బాహుబలి విక్టరీ తర్వాత కొంత గ్యాప్‌ తీసుకున్న జక్కన్న పూర్తిగా ఆర్‌ఆర్‌ఆర్‌కే అంకితమైపోయాడు. పైగా స్వాతంత్ర్య సమరవీరుల పాత్రల్లో ఇద్దరు స్టార్‌ హీరోలు జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ నటిస్తుండటంతో ప్రేక్షక లోకం ఈ సినిమాపై ఉత్సుకత ప్రదర్శిస్తోంది. ఈ సినిమా రిలీజ్‌ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తోంది. (చదవండి: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు షాకిచ్చిన నటి.. విడుదల తేదీ లీక్‌)

ఈ మధ్యే ఆర్‌ఆర్‌ఆర్‌ క్లైమాక్స్‌ షూటింగ్‌ కూడా స్టార్ట్‌ కావడంతో రానున్న రోజుల్లో వరుస అప్‌డేట్స్‌ రావడం ఖాయమని అభిమానులు ఆనందపడ్డారు. వారు అనుకున్నట్లుగానే చిత్రయూనిట్‌ నేడు ఓ బంపర్‌ అప్‌డేట్‌ ఇవ్వనుందట. మధ్యాహ్నం రెండు గంటలకు ఓ ప్రకటన విడుదల చేస్తామని సోషల్‌ మీడియాలో వెల్లడించింది. దేని గురించన్నది మాత్రం సస్పెన్స్‌. దీంతో నెటిజన్లు టీజర్‌ రిలీజ్‌ డేట్‌ చెప్తారా? షూటింగ్‌ ముగిసిందని శుభవార్త మోసుకొస్తారా? లేదా? ఏకంగా సినిమా విడుదల తేదీని చెప్పి అందరినీ సర్‌ప్రైజ్‌ చేస్తారా? అంటూ బుర్రలు బద్ధలు చేసుకుంటున్నారు. ఏదైతేనేం, ఇంకొద్ది గంటలు ఆగితే ఆ అప్‌డేట్‌ ఏంటనేది రాజమౌళే నేరుగా చెప్పేస్తాడు. కాబట్టి అప్పటివరకు వేచి చూద్దాం.. (చదవండి: ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు నాగ్‌ అశ్విన్‌ గుడ్‌ న్యూస్‌)

మరిన్ని వార్తలు