ఆర్‌ఆర్‌ఆర్‌ అప్‌డేట్‌ : స్టూడియోలో మ్యాజిక్ జరిగిందట

12 Apr, 2021 08:46 IST|Sakshi

విజువల్స్‌ పరంగా మాత్రమే కాదు... మ్యూజిక్‌ పరంగా కూడా స్పెషల్‌ కేర్‌ తీసుకుంటుంటారు దర్శకుడు రాజమౌళి. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘రౌద్రం.. రణం.. రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్‌)  విషయంలోనూ ఇదే ఫాలో అవుతున్నారు. ఈ సినిమా కోసం బాలీవుడ్‌ మ్యూజిక్‌ కంపోజర్, సింగర్‌ విశాల్‌ మిశ్రాతో పాట పాడించారట రాజమౌళి.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సంగీత దర్శకుడు కీరవాణి, రాజమౌళితో కలిసి ఉన్న ఫోటోను షేర్‌ చేశారు విశాల్‌ మిశ్రా. ‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కోసం స్టూడియోలో మేం మ్యాజిక్‌ చేశాం. కమింగ్‌ సూన్‌’’ అని పేర్కొన్నారు విశాల్‌. జూనియర్‌ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా నటిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా ఈ ఏడాది అక్టోబరు 13న విడుదల కానున్న సంగతి తెలిసిందే. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు