ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌ వీడియో వైరల్‌

3 Dec, 2020 16:49 IST|Sakshi

జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌(రౌద్రం రణం రుధిరం). ఇందులో కొమురమ్‌ భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. అలియా భట్‌, ఒలీవియా మోరిస్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సుమారు 400 కోట్ల బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే కీలక సన్నివేశాలను తెరకెక్కించిన దర్శక ధీరుడు రాజమౌళి.. మరో షెడ్యూల్‌ని మహారాష్ట్రలోని మహాబలేశ్వరంలో ప్లాన్‌ చేశారు.
(చదవండి : ద‌ర్శ‌కుడి వెంట‌ప‌డి చిత‌క‌బాదిన హీరోయిన్‌)

ఈ షెడ్యూల్‌లో రామ్‌ చరణ్‌, తారక్‌ కూడా పాల్గొంటారని చిత్రం బృందం వెల్లడించింది. ఈ మేరకు ఓ వీడియోను ట్వీటర్‌ వేదికగా విడుదల చేసింది.ఇక్కడి ప్రకృతి అందాల మధ్య కొన్ని సన్నివేశాలను దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. మూవింగ్ క్రేన్ షాట్లు, డ్రోన్ షాట్లు తీసినట్టు వీడియో చూస్తే తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, రామ్ చరణ్. ఎన్టీఆర్‌కు కు సంబంధించిన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. 400 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తయారవుతున్న ఈ ఫిక్షనల్‌ పీరియాడిక్‌ చిత్రం 2021లో ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా